Niharika : వరుస హిట్స్ కొడుతున్న యువ హీరో.. కొత్త స్టార్ ట్యాగ్ ఇచ్చిన నిహారిక..

తాజాగా వరుస హిట్స్ కొడుతున్న సంగీత్ శోభన్ కి కొత్త స్టార్ ట్యాగ్ ఇచ్చారు. (Niharika)

  • Published On : April 10, 2026 / 09:21 PM IST

Niharika

Niharika : సాధారణంగా హీరోలందరికీ పేరు ముందు ఏదో ఒక స్టార్ ట్యాగ్ ఉంటుంది. ఏదో ఒక స్టార్ పేరుతో అభిమానులు తమ హీరోని పిలుచుకుంటారు. గతంలో స్టార్ హీరోలకు మాత్రమే వేసుకునే ట్యాగ్ ఇప్పుడు ప్రతి హీరోకి సాధారణం అయిపోయింది. హీరోలు స్వతహాగా ఈ స్టార్ ట్యాగ్స్ పెట్టుకోకపోయినా అభిమానులు లేదా హీరో చుట్టుపక్కల ఉండే వాళ్ళు, హీరోతో పనిచేసేవాళ్ళు ఈ ట్యాగ్స్ పెడతారు.

ఇప్పటికే మన టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు ఏదో ఒక స్టార్ ట్యాగ్ ఉంది. తాజాగా వరుస హిట్స్ కొడుతున్న సంగీత్ శోభన్ కి కొత్త స్టార్ ట్యాగ్ ఇచ్చారు. మ్యాడ్, మ్యాడ్ 2, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ.. ఇలా వరుసగా హిట్స్ కొడుతూ తన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తున్నాడు సంగీత్ శోభన్. ఇటీవలే రాకాస సినిమాతో వచ్చి మరో విజయం సాధించాడు సంగీత్.

Also Read : Movie Theaters : అప్పుడు పవన్ సినిమాకు.. ఇప్పుడు చరణ్ సినిమాకు.. థియేటర్స్ బంద్ అంటూ..

తాజాగా రాకాస డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్ లో నిహారిక సంగీత్ గురించి మాట్లాడుతూ.. ఫస్ట్ నుంచి చెప్తున్నా అది ట్యాగ్ లైన్ అనుకోకండి. నాకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచే సంగీత్ షైనింగ్ స్టార్ అని తెలిపింది. దీంతో షైనింగ్ స్టార్ అనే ట్యాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. నిహారిక, సంగీత్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి రెండు ప్రాజెక్ట్స్ కి పనిచేసారు.

ఈ స్టార్ ట్యాగ్స్ ఇలాగే అనుకోకుండా వచ్చి ఫిక్స్ అయిపోతాయి. భవిష్యత్తులో సంగీత్ శోభన్ సినిమాల్లో షైనింగ్ స్టార్ అనే ట్యాగ్ ని దర్శక నిర్మాతలు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Also See : Shriya Sharma : శ్రియ శర్మ పుట్టిన రోజు సెలబ్రేషన్స్.. క్యూట్ ఫొటోలు చూశారా..?