నిహారిక వెడ్డింగ్ కార్డ్ చూశారా!

  • Publish Date - December 2, 2020 / 01:43 PM IST

Niharika Konidela Wedding Invitation: మెగా డాటర్‌ నిహారిక కొణిదెల పెళ్ళికూతురు కాబోతోంది. డిసెంబర్‌ 9న నిహారిక వివాహం జొన్నలగడ్డ వెంకట చైతన్యతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇందుకు రాజస్థాన్, ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ వేదిక కానుంది.


తాజాగా నిహారిక పెళ్ళికి సంబంధించిన శుభలేఖను మెగా ఫ్యామిలీ అధికారికంగా విడుదల చేసింది. డిసెంబర్‌ 9, బుధవారం రాత్రి 7:15 నిమిషాలకు మిథున లగ్నంలో వివాహం జరగబోతోంది. ఆ తర్వాత డిసెంబర్‌ 11, శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్‌లో రిసెప్షన్‌ జరగనుంది. నిహారిక పెళ్లి వివరాలకు సంబంధించిన వెడ్డింగ్‌ కార్డ్ ఎలా ఉందో మీరూ చూసెయ్యండి మరి..
https://10tv.in/bomma-adirindi-dimma-thirigindi-teaser/