Niharika NM : బాలీవుడ్ నటుడితో తెలుగు హీరోయిన్ ఫొటోలు వైరల్.. ప్రేమలో ఉన్నారా? ప్రమోషన్ చేస్తున్నారా?
అమెరికా వెళ్లి అక్కడ రీల్స్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంది. ఏకంగా హాలీవుడ్ సినిమాలు కూడా ప్రమోషన్ చేసే రేంజ్ లో ఫేమ్ తెచ్చుకుంది నిహారిక. (Niharika NM)
- Saketh U
- Published on- June 30, 2026 / 02:36 PM IST
Niharika NM
Niharika NM : తెలుగమ్మాయి నిహారిక NM సోషల్ మీడియాలో రీల్స్ తో స్టార్ గా మారింది. అమెరికా వెళ్లి అక్కడ రీల్స్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంది. ఏకంగా హాలీవుడ్ సినిమాలు కూడా ప్రమోషన్ చేసే రేంజ్ లో ఫేమ్ తెచ్చుకుంది నిహారిక. నిహారిక రీల్స్ చూసి యాక్టింగ్ ఛాన్సులు ఇవ్వడంతో నటిగా కూడా మారింది. తమిళ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చి తెలుగులో మిత్రమండలి సినిమాతో హీరోయిన్ గా మారింది.
బాలీవుడ్ లో కూడా నిహారికకు ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. ఎక్కువగా సినిమా, కార్పొరేట్ ప్రమోషన్స్ చేస్తుంది ఈ భామ. తాజాగా బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ తో చాలా క్లోజ్ గా హత్తుకొని దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి లవ్ సింబల్ తో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవ్వగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అంటున్నారు.
Also Read : Brigida Saga : ప్రియుడ్ని పరిచయం చేసిన పవి టీచర్.. బాయ్ ఫ్రెండ్ తో ‘బ్రిగిడ సాగ’ ఫొటోలు..
రాఘవ్ జుయల్ హిందీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాలు చేసాడు. ఇటీవలే కిల్ సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు ఇలా తెలుగమ్మాయి నిహారికతో ఫొటోలు షేర్ చేయడంతో బాలీవుడ్ లో కూడా ఈ జంట చర్చగా మారింది. అయితే ఇది నిజంగా ప్రేమేనా? వాళ్ళ రిలేషన్ ని ప్రకటించారా? లేక ఏదైనా సినిమా ప్రమోషనా అని సందేహిస్తున్నారు.
వీరిద్దరూ కలిసి ఓ ప్రైవేట్ లవ్ సాంగ్ కూడా చేస్తున్నారని వార్తలు ఉన్నాయి. దీంతో ఆ సాంగ్ ప్రమోషన్ కోసం ఇలా పోస్ట్ చేసారా లేక నిజంగానే ఈ జంట ప్రేమలో ఉన్నారా అని చర్చించుకుంటున్నారు. మొత్తానికి తెలుగమ్మాయి నిహారిక బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
