Karthikeya 3 : కార్తికేయ 3 అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందు మొండేటి.. ఎప్పుడంటే..?

కార్తికేయ 2 తర్వాత నుంచి అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు నిఖిల్. అయితే కార్తికేయ సిరీస్ ఫ్యాన్స్ ఈ సినిమాకి పార్ట్ 3 ఎప్పుడు ఉంటుంది అని అడుగుతూనే ఉన్నారు. గతంలో కూడా డైరెక్టర్, నిఖిల్ కార్తికేయ 3 ఉంటుంది అని చెప్పారు. తాజాగా మరోసారి కార్తికేయ 3 పై మాట్లాడారు డైరెక్టర్ చందు.

Nikhil Karthikeya 3 Movie update by director Chandoo Mondeti

Karthikeya 3 : నిఖిల్(Nikhil) హీరోగా చందు మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ మంచి విజయం సాధించి నిఖిల్ కెరీర్ ని మలుపు తిప్పింది. గత సంవత్సరం ఇదే కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ 2 సినిమా ఏకంగా పాన్ ఇండియా హిట్ కొట్టింది. గత సంవత్సరం ఆగస్టులో వచ్చిన కార్తికేయ సినిమా మెల్లిగా మొదలయి దేశమంతా విస్తరించి భారీ విజయం సాధించి ఏకంగా 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో నిఖిల్ కెరీర్ ఓ రేంజ్ కి వెళ్ళిపోయింది.

కార్తికేయ 2 తర్వాత నుంచి అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు నిఖిల్. అయితే కార్తికేయ సిరీస్ ఫ్యాన్స్ ఈ సినిమాకి పార్ట్ 3 ఎప్పుడు ఉంటుంది అని అడుగుతూనే ఉన్నారు. గతంలో కూడా డైరెక్టర్, నిఖిల్ కార్తికేయ 3 ఉంటుంది అని చెప్పారు. తాజాగా మరోసారి కార్తికేయ 3 పై మాట్లాడారు డైరెక్టర్ చందు. కార్తికేయ 2 సినిమా రిలీజయి సంవత్సరం అయినందుకు గాను చిత్రయూనిట్ మీడియాతో స్పెషల్ సమావేశం ఏర్పాటు చేసింది.

Nelson Dilip Kumar : రజినీకాంత్ – విజయ్ ఒకే సినిమాలో.. నా డ్రీమ్ అదే.. జైలర్ డైరెక్టర్ నెల్సన్..

ఈ సమావేశంలో డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ.. నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిఖిల్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. నా చేతిలో ఒక సినిమా ఉంది. అతనివి మూడు సినిమాలు నాదొక సినిమా అయిపోయిన తర్వాత కార్తికేయ 3 ఉంటుంది. ఈ సారి మరింత భారీగా ఉంటుంది అని తెలిపాడు. దీంతో కార్తికేయ 3 ఉంటుంది కానీ కొంచెం ఎక్కువే టైం పడుతుందని అర్ధమవుతుంది.

ట్రెండింగ్ వార్తలు