Nikki Tamboli: చెత్తగా ప్రవర్తించాడు.. టాలీవుడ్ దర్శకుడిపై నిక్కీ కామెంట్స్
ఉత్తరాది నుండి వచ్చి సౌత్ లో సినిమాలు చేసిన హీరోయిన్స్ అంతా ఇక్కడి దర్శకుల గురించి గొప్పగా చెప్తుంటారు. దాదాపుగా ఒకరిద్దరు మినహా ఇప్పటి వరకు అందరి గురించి బీ టౌన్ భామలు గొప్పగానే చెప్పారు. అయితే.. నిక్కీ తంబోలీ మాత్రం ఓ టాలీవుడ్ దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
- Naresh Mannam
- Published On : May 12, 2022 / 09:27 PM IST
Nikki Tamboli
Nikki Tamboli: ఉత్తరాది నుండి వచ్చి సౌత్ లో సినిమాలు చేసిన హీరోయిన్స్ అంతా ఇక్కడి దర్శకుల గురించి గొప్పగా చెప్తుంటారు. దాదాపుగా ఒకరిద్దరు మినహా ఇప్పటి వరకు అందరి గురించి బీ టౌన్ భామలు గొప్పగానే చెప్పారు. అయితే.. నిక్కీ తంబోలీ మాత్రం ఓ టాలీవుడ్ దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందీ బిగ్‌బాస్ 14లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచి అటు హిందీతో పాటు తెలుగులో కూడా అవకాశాలు దక్కించుకున్న నిక్కీ తంబోలీ ఇప్పుడిప్పుడే బిజీ హీరోయిన్ గా మారుతుంది.
Nikki Tamboli: ఉబికి వస్తున్న అందాలతో నిక్కీ తంబోలి అరాచకం!
కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు దక్షిణాదిలో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ‘నాకిప్పటికీ గుర్తుంది, ఓ సౌత్ డైరెక్టర్ నాతో ప్రవర్తించిన తీరు నాకస్సలు నచ్చలేదు. సెట్స్‌లో నాతోపాటున్న డ్యాన్సర్స్ అందరినీ మెచ్చుకుంటున్నాడు. నన్ను మాత్రం ఎక్కడినుంచి వస్తారో నీలాంటి వాళ్లు? అంటూ చులకన చేసి మాట్లాడాడు. అప్పుడు నాకు అక్కడి భాష మాట్లాడానికి వచ్చేది కాదు. కానీ అతడు మాత్రం చాలా చెత్తగా ప్రవర్తించాడు. విదేశాల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో నన్ను చీప్‌గా చూస్తూ దారుణంగా ప్రవర్తించేవాడు.
Nikki Tamboli: బాబోయ్.. పోజులతోనే పిచ్చెక్కించేస్తుందే!
షూటింగ్ నుండి నేను ఇంటికి వచ్చాక చాలా ఏడ్చేదాన్ని. కానీ మధ్యలో వెనకడుగు వేయలేదు. ఎందుకంటే ఎప్పటికైనా అతడు తన తప్పు తెలుసుకుని ఫీల్ అవుతాడని భావించాను. ఇప్పటికీ ఆయన నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నాడు. కాలం అన్నింటినీ మార్చేస్తుంది’ అని చెప్పుకొచ్చింది. కాగా నిక్కీ తంబోలి తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘కాంచన 3’, ‘తిప్పరా మీసం’ సినిమాలో నటించింది. మరి ఆ దర్శకుడు ఎవరో..?
