Nirupam Paritala : చిరంజీవి తల్లితో కార్తీక దీపం డాక్టర్ బాబు అనుబంధం..
చిరంజీవి తల్లి అంజనా దేవితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు నిరుపమ్ పరిటాల. (Nirupam Paritala)
- Saketh U
- Published On : April 5, 2026 / 08:44 AM IST
Nirupam Paritala
Nirupam Paritala : సీరియల్ యాక్టర్ నిరుపమ్ పరిటాల కార్తీక దీపం సీరియల్ తో మరింత ఫేమ్ తెచ్చుకొని వైరల్ అయ్యాడు. స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో నిరుపమ్ పరిటాల కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి నిరుపమ్ పరిటాల అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఈ క్రమంలో చిరంజీవి తల్లి అంజనా దేవితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు.
Also Read : Pragya Jaiswal : ఫ్రెండ్ పెళ్ళి వేడుకల్లో ఎంజాయ్ చేస్తున్న ప్రగ్య జైస్వాల్.. ఫొటోలు..
నిరుపమ్ పరిటాల మాట్లాడుతూ.. చిరంజీవి గారి తల్లి అంజనా దేవి గారు కార్తీక దీపం సీరియల్ చూస్తారు. ఆ సీరియల్ ఆవిడకు నచ్చింది. ఆ సీరియల్ చూసి నాతో కొన్ని సార్లు ఫోన్ లో మాట్లాడారు. వాళ్ళ రిలేటివ్స్ ఒకరు మా ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళు వచ్చి ఇలా చిరంజీవి మదర్ మాట్లాడాలి అంట మీతో అని రెండు మూడు సార్లు అడిగారు.
మొదట ఆలోచించినా అంత పెద్దావిడ అడిగారు అని నేనే నెంబర్ తీసుకొని మొదటిసారి ఫోన్ చేసి మాట్లాడాను. సీరియల్ గురించి, నా గురించి చాలా సేపు మాట్లాడారు. నా కొడుకు లాగే నువ్వు అని అన్నారు.ఓ సారి నేను ఇంట్లో లేనప్పుడు ఓ వ్యక్తి వచ్చి మ్యాంగో బాక్స్ పార్సిల్ ఇచ్చి వెళ్లారు. తర్వాత అది అంజనా దేవి గారు పంపించారని తెలిసి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాను. అప్పుడప్పుడు నా సీరియల్ చూసి కాల్ చేస్తూనే ఉంటారు ఆవిడ అని తెలిపారు.
Also Read : Rashmika Mandanna : రష్మిక మందన్న బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి క్యూట్ ఫొటోస్ చూశారా..?
