VNRTrio : చిరంజీవి చేతులు మీదుగా గ్రాండ్‌గా లాంచ్ అయిన నితిన్ కొత్త సినిమా..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో తన 32వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా మరో కొత్త మూవీని కూడా లాంచ్ చేసేశాడు. భీష్మ (Bheeshma) వంటి సూపర్ హిట్టుని ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు.
- gum 95921
- Published On : March 24, 2023 / 02:49 PM IST
Nithiin and Rashmika new movie launched by chiranjeevi
VNRTrio : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) ఒక సినిమాతో హిట్ కొట్టి.. ఆ తరువాత రెండు, మూడు సినిమాలు ప్లాప్ ఇవ్వడం కామన్ అయ్యిపోయింది. చివరిగా 2020లో భీష్మ (Bheeshma) మూవీతో హిట్ అందుకున్నాడు. ఆ తరువాత చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో ప్లాపులు అందుకున్నాడు. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో తన 32వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా మరో కొత్త మూవీని కూడా లాంచ్ చేసేశాడు. చివరిగా తనకి భీష్మ వంటి సూపర్ హిట్టుని ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు.
Nithiin: వెంకీ కోసం ప్రయోగం చేయబోతున్న నితిన్.. వర్కవుట్ అయ్యేనా..?
భీష్మ సినిమా సక్సెస్ తరువాత వెంకీ కుడుముల చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించినా, అది ఎందుకో సెట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు నితిన్ తోనే తన తదుపరి సినిమాని ప్రకటించాడు. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నేడు (మార్చి 24) ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్ట్ గా రాగా.. దర్శకులు మలినేని గోపీచంద్, బాబీ, హను రాఘవపూడి, బూచి బాబు మరియు చిత్ర యూనిట్ హాజరయ్యారు.
Nithiin: ప్రభాస్ మూవీ స్టోరీలైన్‌తో నితిన్ నయా మూవీ.. వర్కవుట్ అయ్యేనా..?
ఇక హీరో హీరోయిన్లు పై మొదటి సీన్ చిత్రీకరించగా చిరంజీవి క్లాప్ కొట్టాడు. గోపీచంద్ అండ్ బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. హను రాఘవపూడి, బూచి బాబు మూవీ టీంకి స్క్రిప్ట్ ని అందించారు. కాగా భీష్మ సినిమాని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా, ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్ డ్రామాగా తీసుకు రాబోతున్నట్లు తెలియజేశాడు దర్శకుడు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జి వి ప్రకాష్ (GV Prakash Kumar) ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. భీష్మ సినిమాతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్న ఈ టీమ్.. ఈ మూవీతో కూడా విజయాన్ని అందుకుంటారా? లేదా? చూడాలి.
#VNRTrio movie launched with Megastar @KChiruTweets Garu sounding the clap ?
Top directors @dirbobby, @megopichand, @hanurpudi & @BuchiBabuSana graced the grand launch event and wished team the best ❤️@actor_nithiin @iamRashmika @VenkyKudumula @gvprakash pic.twitter.com/QeQksv0ltL
— Mythri Movie Makers (@MythriOfficial) March 24, 2023
