Nithiin: రూపాయి ఖర్చు లేకుండా ఫుల్ పబ్లిసిటీ!
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్ర దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి పేరుతో ఓ ఫేక్ ఐడీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Anil Aaleti
- Published On : July 27, 2022 / 04:21 PM IST
Nithiin Macherla Niyojakavargam Gets Free Publicity
Nithiin: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాలో ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉండే ఉంటుందని ఆడియెన్స్ భావిస్తున్నారు. అయితే ఈసారి పక్కా పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో నితిన్ నటిస్తోన్న చిత్రం కావడంతో ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో రిలీజ్ కు దగ్గరపడటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి.
Macherla Niyojakavargam: ఈగో కా బాప్ అంటోన్న గుంతలకడి గురునాధం!
అయితే ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండగా, ఇప్పుడు ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్ర దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి పేరుతో ఓ ఫేక్ ఐడీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ అకౌంట్ నుండి ఏపీ సీఎం జగన్ పేరును ప్రస్తావిస్తూ పలు కులాలపై వివాదాస్పద కామెంట్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమా దర్శకుడు అండ్ హీరో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తనపేరుపై ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, గతంలో చేసిన కామెంట్స్ ను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారని.. ఈ వివాదాన్ని సినిమాకు రుద్దవంటూ వారు ఆడియెన్స్ ను కోరుతున్నారు.
Macherla Niyojakavargam: శ్రీకాకుళంలో మాచర్ల మాస్ జాతర!
కాగా.. మరికొంతమంది ఈ విధంగానైనా సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ దక్కుతుందని.. ఇది సినిమాకు కలిసొచ్చే అంశం అని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రెండింగ్ అవుతుండటం నిజంగానే సినిమాను జనంలోకి తీసుకెళ్లడంలో బాగా హెల్ప్ అవుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన అందాల భామలు కృతి శెట్టి, కేథరిన్ త్రేజాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
