Nithin-Ritika Nayak: లాంఛనంగా మొదలైన ‘నితిన్’ కొత్త మూవీ.. హీరోయిన్ గా రితికా నాయక్
సితార బ్యానర్ లో నితిన్(Nithin-Ritika Nayak) హీరోగా కొత్త సినిమా పూజ కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది.
- V Santhosh Kumar
- Updated on- May 6, 2026 / 03:17 PM IST
Nithin and Ritika Nayak new movie grand opening
-
నితిన్ కొత్త సినిమా గ్రాండ్ లాంచ్.
-
మే నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్.
-
సితార బ్యానర్‌లో క్రేజీ ప్రాజెక్ట్.
Nithin-Ritika Nayak: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్, తన కెరీర్ స్టార్టింగ్ ‘జయం’ మూవీ నుండి నేటి వరకు డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తూ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. లవర్ బాయ్ ఇమేజ్‌తో పాటు వెర్సటైల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ఆయన స్టైలే వేరు. ఇప్పుడు తన కెరీర్‌లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.
Lavanya Tripathi: ‘సతీ లీలావతి’ మూవీ ప్రమోషన్స్ లో లావణ్య త్రిపాఠి.. ఫొటోలు వైరల్
తాజాగా ఈ కొత్త సినిమా గ్రాండ్ గా పూజా సెర్మనీతో లాంచ్ అయ్యింది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్స్ నారి సిరిసవాడ, సోమశేఖర్ టి ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా, నితిన్ సరసన మిరాయ్ ఫేమ్ రితికా నాయక్ (Nithin-Ritika Nayak)హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఇండస్ట్రీలో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది.
ఈ మూవీకి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తుండగా, అనిత్ మదాడి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ టీమ్ సెట్ అవ్వడంతో అవుట్‌పుట్ అదిరిపోతుందని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇక షూటింగ్ అప్‌డేట్ విషయానికి వస్తే, మే సెకండ్ వీక్ నుండి రెగ్యులర్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. మరిన్ని ఎగ్జైటింగ్ డీటెయిల్స్ కోసం మేకర్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారు.
