Niveda Thomas
Niveda Thomas : నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘అంటే సుందరానికి’. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని బాగా అలరించాయి. ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా జూన్ 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ‘అంటే సుందరానికి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9 గురువారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగగా ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఈ ఈవెంట్ లో నివేదా థామస్ మాట్లాడుతూ.. ”ఇంతమందిని చూసి చాలా రోజులైంది. బ్రోచేవారెవరు సినిమా అయ్యాక నాని సినిమా చూడాలి, చూసి ఒపీనియన్ చెప్పాలి అని కాల్ చేశాను. నాని వివేక్ తో పని చేయాలి అనుకున్నాను. బ్రోచేవారెవరు టీం మొత్తం ఇక్కడే ఉన్నారు. అందుకే ఈ ఫంక్షన్ నా సినిమాలాగా ఉంది. నజ్రియా గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. వివేక్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుతుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా మూవీ కంటే నాకు ఎక్కువ టెన్షన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. థ్యాంక్ యు సర్. ఈ సినిమాకి పని చేసిన వారందరికీ ఆల్ ది బెస్ట్. థియేటర్లలో చూడండి సినిమాని” అని తెలిపింది.
Hareesh Shankar : పవన్ ఫ్యాన్స్ పైన సీరియస్ అయిన హరీష్ శంకర్..
నివేదా థామస్ డైరెక్టర్ వివేక్ గతంలో నటించిన బ్రోచేవారెవరురా సినిమాలో హీరోయిన్ గా చేసింది. అలాగే నాని తో కూడా మూడు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.