మొన్నే పెళ్లి.. అప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక.. ఇప్పుడు మేము ముగ్గురం అయ్యాం అంటూ పోస్ట్

ఇప్పుడు తమ ప్రపంచం ముగ్గురిగా మారింది అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టిన రష్మిక మందన్న(Rashmika).

'Now we become trio' Rashmika Mandanna interesting post

Rashmika: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ, వివాహ వేడుకను మాత్రం అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లకుండా, స్నేహితులతో కలిసి ‘బడ్డీమూన్’ విహారయాత్రను ఎంజాయ్ చేసిన ఈ జంట, పలు నగరాల్లో అభిమానులకు స్వీట్లు పంపిణీ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు.

Bandla Ganesh: బండ్ల గణేష్ కూతురి పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోస్

అయితే, ఇటీవల రష్మిక సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. “ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం” అంటూ ఒక యానిమేషన్ వీడియోను షేర్ చేయడం, అందులో ఆమె టీషర్టుపై గుడ్డు బొమ్మ ఉండటంతో ఆమె తల్లి కాబోతుందనే వార్తలు వైరల్ అయ్యాయి. నెటిజన్లు పెళ్లయిన నెల రోజులకే శుభవార్త చెప్పారంటూ శుభాకాంక్షలు కురిపించారు.

కానీ అసలు విషయం ఏమిటంటే, రష్మిక(Rashmika) తన ప్రియమైన ‘పొద్దుతిరుగుడు పువ్వు’ను (Sunflower) తన క్లోజ్ ఫ్రెండ్‌గా భావిస్తుంది. దీనికోసం ఆమె ప్రత్యేకంగా ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా నిర్వహిస్తోంది. ఆ యానిమేషన్ ప్రపంచంలోకి ఇప్పుడు విజయ్‌ను కూడా ఆహ్వానిస్తూ ఈ పోస్ట్ పెట్టింది తప్ప, ఆమె గర్భవతి అనే వార్తల్లో నిజం లేదు. కేవలం తన యానిమేటెడ్ కథల లోకంలోకి విజయ్ చేరడాన్నే ఆమె అలా సరదాగా పంచుకుంది.