శ్రీనివాస్ అవసరాల హీరోగా నటిస్తున్న NRI-నాయనా..! రారా ఇంటికి – షూటింగ్ ప్రారంభం ..
శ్రీనివాస్ అవసరాల హీరోగా, కెఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై, ప్రదీప్ కెఆర్ నిర్మాతగా, బాల రాజశేఖరుని డైరెక్షన్‌లో రూపొందబోయే NRI-నాయనా..! రారా ఇంటికి.. సినిమా, అన్నపూర్ణ స్టూడియోలో, పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని అమల క్లాప్ నివ్వగా, డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి కెమెరా స్విచ్చాన్ చేసాడు. బాల రాజశేఖరుని ఫస్ట్ షాట్‌ని డైరెక్ట్ చేసాడు. నేచురల్ స్టార్ నాని, సుమంత్, సుశాంత్, అఖిల్, నాగశౌర్య, సిరివెన్నెల, వి.విజయేంద్ర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసారు.
పిల్లల్ని మిస్ అవుతున్న తల్లిదండ్రుల పెయిన్ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు. ఇండియా, అమెరికాలో షూటింగ్ జరపనున్నారు. హైలీ ఎనర్జిటిక్, రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కబోయే ఈ సినిమాలో లక్ష్మీ మంచు, మహతి, నాగబాబు లీడ్ రోల్స్ చేస్తుండగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అబ్బాయి యోగేశ్వర శర్మ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఈ సినిమాకి కెమెరా : వెంకట్ సి దిలీప్, మ్యూజిక్ : యోగేశ్వర శర్మ, లిరిక్స్ : సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఎడిటింగ్ : చోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : సింధూజ, ఫైట్స్ : ఆర్.భరత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ కుమార్.