SPB ఆరోగ్య పరిస్థితిపై NRIల ఆందోళన..

  • Publish Date - September 25, 2020 / 01:14 AM IST

SPB Health Condition- NRI’s: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆయనకు చికిత్సనందిస్తున్న ఎంజీఎం ఆసుపత్రి అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో సినీ వర్గాల వారు, ప్రేక్షకులు ఆందోళనకు గురవుతున్నారు.

అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత కళాకారులు, బాలు అభిమానులు ఆయన కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు.. బాలు పాటలకు అభిమానులైన వారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు చూసి బాగా ఆందోళన చెందుతున్నారు.

‘ఏ దేశ మేగినా ఎందుకాలిడినా అన్నట్లు మేమంతా రోజూ బాలు గారి పాటలు వింటూ ఉంటాం.. ఆయన ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వినిపిస్తుంటే భయంగా ఆందోళనగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని, ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ తన పాటలతో మమ్మల్ని అలరించాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాం’ అంటూ ఎన్నారైలు ఆకాంక్షిస్తున్నారు.