×
Ad

Tarakarathna : విషమంగా తారకరత్న ఆరోగ్యం.. నేడు బెంగళూరుకు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్..

బెంగుళూరు హాస్పిటల్ లో తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శనివారం నాడు తారకరత్న ఆరోగ్యంపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేస్తూ ప్రస్తుతం తారకరత్న పరిస్థితి..................

  • Published On : January 29, 2023 / 09:00 AM IST

NTR and Kalyan ram going to Benguluru Hospital for visit Tarakarathna

Tarakarathna :  ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ఆ తర్వాత సినిమాలకి కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు నందమూరి తారకరత్న. తాజాగా గత కొన్ని రోజులుగా టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కుప్పంలో నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించగా ఈ పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో నటుడు తారకరత్న కూడా పాల్గొన్నాడు. నారా లోకేశ్ తో కలిసి నడుస్తుండగా మొదటి రోజే హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు తారకరత్న. దీంతో కార్యకర్తలు హుటాహుటిన కుప్పంలోని ఓ హాస్పిటల్ కి తరలించారు.

నటుడు తారకరత్నకు కుప్పం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి గుండెపోటుతో పడిపోయారని తెలియడంతో బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు. బెంగుళూరు హాస్పిటల్ లో తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శనివారం నాడు తారకరత్న ఆరోగ్యంపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేస్తూ ప్రస్తుతం తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది, ICU లో చికిత్స అందిస్తున్నాము అని తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ, పురందేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు బెంగుళూరు హాస్పిటల్ కి చేరుకున్నారు. తారకరత్న భార్య, కూతురు కూడా బెంగుళూరు హాస్పిటల్ లోనే ఉన్నారు.

Errabelli Dayakar Rao : వరంగల్ లో స్టూడియో పెట్టండి.. ప్లీజ్.. KCR గారితో నేను మాట్లాడతాను..

నేడు బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తారకరత్నని చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ కూడా వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లనున్న ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ బెంగుళూరుకి వెళ్లి అక్కడినుంచి హాస్పిటల్ కి వెళ్తారు. అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అంతా తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, పలువురు టీడీపీ నాయకులు అక్కడే హాస్పిటల్ లో ఉండి పర్యవేక్షిస్తున్నారు.