Errabelli Dayakar Rao : వరంగల్ లో స్టూడియో పెట్టండి.. ప్లీజ్.. KCR గారితో నేను మాట్లాడతాను..
ఈ ఈవెంట్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ చిరంజీవితో, నిర్మాత నవీన్ తో ఆయనకి 20 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని తెలియచేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి, రామ్ చరణ్ గారికి ఒక్కటే చెప్తున్నా......................

Errabelli Dayakar Rao request chiranjeevi for construct studio in Warangal
Errabelli Dayakar Rao : చిరంజీవి, శృతి హాసన్ జంటగా రవితేజ ముఖ్య పాత్రలో బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించి ఇప్పటికే దాదాపు 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా భారయీ విజయం సాధించటంతో మెగా అభిమానులు, చిత్రయూనిట్ అంతా ఆనందంలో ఉన్నారు. గతంలోనే సినిమా హిట్ అయినందుకు సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్రయూనిట్. తాజాగా వాల్తేరు వీరయ్య భారీ విజయం సాధించినందుకు వరంగల్ లో వీరయ్య విజయ విహారం పేరిట భారీ సభని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు రామ్ చరణ్, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, వరంగల్ ప్రజా ప్రతినిధులు విచ్చేశారు.
Rangasthalam : ఆ సినిమాకి చరణ్ కి అవార్డు రాలేదని చిరంజీవి ఫీల్ అయ్యారా??
ఈ ఈవెంట్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ చిరంజీవితో, నిర్మాత నవీన్ తో ఆయనకి 20 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని తెలియచేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి, రామ్ చరణ్ గారికి ఒక్కటే చెప్తున్నా, మీరు ఎప్పుడైనా ఇక్కడికి రండి. వరంగల్ లో ఒక స్టూడియో నిర్మించండి, ఇక్కడ షూటింగ్స్ తీయండి. నేను KCR గారితో మాట్లాడి మీకు కావాల్సినవి ఏర్పాటు చేస్తాను,నేను మీకు సపోర్ట్ ఉంటాను అంటూ చిరంజీవి, చరణ్ లని రిక్వెస్ట్ చేశారు.