NtrNeel: ‘ఎన్టీఆర్ డ్రాగన్’ గ్లింప్స్ కోసం నంబర్ గేమ్.. పర్ఫెక్ట్ టైంకి రిలీజ్ చేస్తున్నారుగా
పర్ఫెక్ట్ టైం లో రిలీజ్ కానున్న ఎన్టీఆర్(NtrNeel) డ్రాగన్ మూవీ గ్లింప్స్. ఇక సోషల్ మీడియా షేక్ అవడం ఖాయం.
- V Santhosh Kumar
- Published on- May 12, 2026 / 04:46 PM IST
Ntr and prashanth neel dragon movie glimpse release update
- తారక్ ‘డ్రాగన్’ గ్లింప్స్ అప్‌డేట్.
- మే 20న గ్రాండ్ రిలీజ్.
- లక్కీ నెంబర్ 9 సెంటిమెంట్.
NtrNeel: కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘డ్రాగన్’. ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ, సినిమా విడుదల నెక్స్ట్ ఇయర్ కి వాయిదా పడింది.
Shakeela: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని.. ‘తాయ్ కిళవి’ పాత్రపై షకీలా సంచలన వ్యాఖ్యలు!
అయితే, ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసేందుకు ఈ సినిమా గ్లింప్స్‌ను తారక్(NtrNeel) పుట్టినరోజు సందర్భముగా మే 20న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. దీనిపై అధికారిక ప్రకటన చేశారు. అయితే, ఈ గ్లింప్స్ విడుదల సమయం వెనుక ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ దాగి ఉందని సమాచారం. ఎన్టీఆర్ తన లక్కీ నెంబర్‌గా భావించే 9 (తొమ్మిది) అంకె వచ్చేలా ఈ గ్లింప్స్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
తాజా సమాచారం ప్రకారం, మే 20 అర్ధరాత్రి 12 గంటల 06 నిమిషాలకు అంటే 1+2+0+6=9 కాబట్టి, తొమ్మిది సెంటిమెంట్ వచ్చేలా పర్ఫెక్ట్ టైం ను ఫిక్స్ చేశారట. దీంతో, ఈ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా గ్లింప్స్ సినిమాపై ఏ రేంజ్ అంచనాలను పెంచనుంది అనేది చూడాలి.
