జనవరి 5న ప్రీ- రీలీజ్ ఈవెంట్

జనవరి 5న ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ- రీలీజ్ ఈవెంట్

  • Publish Date - January 2, 2019 / 12:34 PM IST

జనవరి 5న ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ- రీలీజ్ ఈవెంట్

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ, నందమూరి తారక రామారావు జీవిత కథతో రెండు పార్ట్‌‌లుగా, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియో అండ్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ పది మిలియన్ల వ్యూస్ దాటేసింది. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. బాలయ్య డైరెక్టర్ క్రిష్‌తో, నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి మీడియాకి ఇంటర్వూలు ఇస్తున్నాడు.

రీసెంట్‌గా రిలీజ్ చేసిన రిలీజ్ ప్రోమోలో నిర్మాతగా తన భార్య నందమూరి వసుంధరా దేవి పేరు కింద తన పేరు వేసుకున్నాడు బాలయ్య. త ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్‌డేట్ బయటకొచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ- రీలీజ్ ఈవెంట్‌ని జనవరి 5న, హైదరాబాద్‌లోని హోటల్ పార్క్ హయాత్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. జనవరి 9న మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజవబోతోంది.

వాచ్ రిలీజ్ ప్రోమో…

 

 

 

ట్రెండింగ్ వార్తలు