Devara Promotions : తెలుగు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి షాక్.. ‘దేవర’ తెలుగు ప్రమోషన్స్ లేవా?

RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ మూడు నాలుగు సార్లు సినిమా ఈవెంట్స్, ఓపెనింగ్స్ లో తప్ప మీడియా ముందుకు రాలేదు.

NTR Devara Movie Promotions not Happening in Telugu States Concentrate only on Bollywood

Devara Promotions : ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తారు, ఎన్టీఆర్ మీడియా ముందుకు వస్తాడు, ఫ్యాన్స్ ని కలుస్తారు అని అనుకున్నారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం దేవర సినిమాకు తెలుగులో ఎక్కువ ప్రమోషన్స్ చేయరట.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర ట్రైలర్ లాంచ్ కి ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో దేవర ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా చేయనున్నారు. ఆ తర్వాత ముంబైలో రిలీజ్ కి ముందు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తారట. ఎన్టీఆర్ బాలీవుడ్ లో పాతుకుపోవడానికి, అక్కడ మార్కెట్ తెచ్చుకోడానికి బాగానే కష్టపడుతున్నాడు. కానీ ఇప్పటి వరకు దేవర తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు.

Also Read : NTR : ముగ్గురు డైరెక్టర్స్.. మూడు పాన్ ఇండియా సినిమాలు.. తన డైరెక్టర్స్‌తో ఎన్టీఆర్ ఫోటో వైరల్..

RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ మూడు నాలుగు సార్లు సినిమా ఈవెంట్స్, ఓపెనింగ్స్ లో తప్ప మీడియా ముందుకు రాలేదు. తెలుగులో దేవర సినిమా ఎలాగు చూస్తారు. ఫ్యాన్స్ థియేటర్స్ కి వెళతారు, సినిమా మీద హైప్ ఉంది కాబట్టి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్తారు. ఇక్కడ కలెక్షన్స్ కూడా భారీగానే వస్తాయి. దేవర ప్రమోషన్స్ తెలుగు రాష్ట్రాల్లో చేయకపోయినా ఎలాంటి నష్టం ఉండదు అని భావిస్తున్నారు.

తెలుగులో కేవలం ఒకటే ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా ముందు ఫ్యాన్స్ కోసం భారీగా నిర్వహిస్తారట. అలాగే ముందే రికార్డ్ చేసిన కొన్ని ఇంటర్వ్యూలు రిలీజ్ చేస్తారట. దేవర సినిమాకి ఎలాంటి ప్రెస్ మీట్స్ ఉండవని టాలీవుడ్ సమాచారం. మీడియా ముందుకు ఎన్టీఆర్, కొరటాల శివ రారని తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో నిరాశ చెందుతున్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే ఎక్కువ విషయాలు మాట్లాడొచ్చు, ఎక్కువసార్లు ఎన్టీఆర్ బయట కనిపిస్తారు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ దేవర తెలుగులో ప్రమోషన్స్ చేస్తారా లేదా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు