NTR Kalyan Ram : మేనల్లుడి పెళ్ళిలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందడి.. మనవడి కోసం వచ్చిన బాలయ్య
వెంకట శ్రీహర్ష వివాహంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేనల్లుడి పెళ్లి కోసం కష్టపడ్డారు అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
- Saketh U
- Published On : August 21, 2023 / 07:29 AM IST
NTR Kalyan Ram and Balakrishna entertained in Nandamuri Suhasini son Marriage
NTR Kalyan Ram : నందమూరి ఫ్యామిలిలో పెళ్లి బాజాలు మోగాయి. నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష వివాహం సాయి గీతికతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో నిన్న ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. మేనల్లుడి పెళ్లి కావడంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు దగ్గరుండి పెళ్లి జరిపించారు. పెళ్లి పనులు కూడా చూసుకున్నారు. పెళ్ళిలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి సందడి చేశారు.
Nandamuri Family : నందమూరి ఫ్యామిలిలో పెళ్లి సందడి.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు..
వెంకట శ్రీహర్ష వివాహంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేనల్లుడి పెళ్లి కోసం కష్టపడ్డారు అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాలయ్య బాబు కూడా ఫ్యామిలీతో మనవడి పెళ్ళికి వచ్చి ఆశీర్వదించారు. నందమూరి మోక్షజ్ఞ కూడా ఈ పెళ్లి వేడుకల ఫొటోల్లో కనపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులంతా ఫ్యామిలీలతో కలిసి ఈ వివాహానికి వచ్చారు. అంతేకాక మరింతమంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుకకి విచ్చేశారు. దీంతో నందమూరి ఇంట పెళ్లి వేడుకల ఫొటోలు వైరల్ గా మారాయి.
