NTR : మూగ అభిమాని కోసం.. చేతికి ఉన్న పౌచ్ తీసేసి మరీ హగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..
ఆ అభిమానిని ఎన్టీఆర్ ప్రత్యేకంగా తన కారవాన్ లో కలిశారు. (NTR)
- Saketh U
- Published on- September 30, 2026 / 01:57 PM IST
NTR
NTR : అప్పుడప్పుడు హీరోలు కూడా తమ ప్రేమని వారి అభిమానుల మీద చూపిస్తూ ఉంటారు. తాజాగా ఎన్టీఆర్ తన మూగ అభిమాని కోసం చేసిన పని ఫ్యాన్స్ ని ఆనందింపచేస్తుంది. ఎన్టీఆర్ నిన్న ఫహద్ ఫాజిల్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి భారీగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఆ ఫ్యాన్స్ లో ఓ మూగ, వినికిడి శక్తి లేని అభిమాని కూడా ఉన్నాడు.
ఆ అభిమానిని ఎన్టీఆర్ ప్రత్యేకంగా తన కారవాన్ లో కలిశారు. అతను ఎన్టీఆర్ అని రాసి ఉన్న టీ షర్ట్ వేసుకు రాగా దాన్ని ఎన్టీఆర్ కి చూపించాడు. అయితే ఎన్టీఆర్ ఇటీవల డ్రాగన్ షూటింగ్ లో గాయపడి చేతికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఎన్టీఆర్ చేతికి సపోర్ట్ గా బెల్ట్ పౌచ్ ని పెట్టుకున్నారు. ఆ అభిమాని ఎన్టీఆర్ ని హగ్ చేసుకుందామని చూడగా ఎన్టీఆర్ స్వయంగా చేతికి ఉన్న ఆ బెల్ట్ పౌచ్ తీసేసి అభిమానిని దగ్గరకు హత్తుకున్నారు.
Also Read : This Week Movies : వామ్మో.. ఏందిది.. ఒక్కరోజే థియేటర్స్ లో పది సినిమాలు రిలీజ్.. ఈ వారం సినిమాలు ఇవే..
దీంతో ఎన్టీఆర్ తన ఫ్యాన్ ని దాగరకు తీసుకో హత్తుకున్నా వీడియోలు వైరల్ గా మారాయి. మా అన్న మంచి మనసు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ఇంకా గాయం తళుకు పెయిన్ నుంచి కోలుకోలేదని ఈ వీడియోతో తెలుస్తుంది.
అభిమాని హగ్ అడిగాడని హ్యాండ్ పౌచ్ బెల్ట్ తీసేసి.. ఎన్టీఆర్ వీడియో వైరల్.. #NTR #jrntr #donttroublethetrouble pic.twitter.com/WgxmJOXTYq
— 10TV Entertainment (@10TvETNews) September 30, 2026
