NTR – Neel : బీచ్‌లో ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్..
తాజాగా మరోసారి ఎన్టీఆర్ - నీల్ వైరల్ అవుతున్నారు.
- Saketh U
- Published On : September 1, 2024 / 04:20 PM IST
NTR Prasanth Neel Family Enjoying in Beach Photo goes Viral
NTR – Neel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో దేవర తర్వాత సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ – నీల్ కి వీరిద్దరూ కలిసిన దగ్గర్నుంచి మంచి స్నేహం ఏర్పడింది. గతంలో పలు మార్లు ఎన్టీఆర్ – నీల్ ఫ్యామిలీలతో కలిశారు, పార్టీలు చేసుకున్నారు, ఒకరింటికి ఒకరు వెళ్లారు.
Also See : Jr NTR Karnataka Trip : ఫ్యామిలీతో ఎన్టీఆర్ కర్ణాటక ట్రిప్.. ఫొటోలు చూసారా..?
తాజాగా మరోసారి ఎన్టీఆర్ – నీల్ వైరల్ అవుతున్నారు. ఎన్టీఆర్ తన భార్య, తల్లి.. ఫ్యామిలీతో కలిసి కర్ణాటక ట్రిప్ కి వెళ్లారు. కర్ణాటకలో నీల్ ఫ్యామిలీ, రిషబ్ శెట్టి ఫ్యామిలీతో కలిసి పలు ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఎన్టీఆర్ తన భర్య ప్రణతి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నీల్ భార్య లిఖిత కలిసి కర్ణాటక ఉడిపి దగ్గర్లోని కుందపురా బీచ్ కి వెళ్లారు.
బీచ్ లో ఎన్టీఆర్, ప్రణతి, ప్రశాంత్ నీల్, లిఖిత కలిసి దిగిన ఫోటోలని లిఖిత తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కర్ణాటక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు.
