Site icon 10TV Telugu

వైరల్ అవుతున్న ఎన్టీఆర్, చరణ్, అనుష్కల ఫోటో

NTR, Ram Charan, and Anushka Shetty with Cabin Crew -10TV

ఎన్టీఆర్, చరణ్, అనుష్కల ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

రాజమౌళి తనయుడు కార్తికేయ మ్యారేజ్, జగపతి బాబు సోదరుడు రామ్ ప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌తో డిజెంబర్ 30వ తేదీన, జైపూర్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. అక్కడి ఫోటోలను ఎప్పటికప్పడు, బంగారం సేస్ ఎస్‌ఎస్ అనే హ్యాష్ ట్యాగ్‌తో నాని మిసెస్ అంజనా, చెర్రీ వైఫ్ ఉపాసన, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చెయ్యగా, విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రభాస్, రాజమౌళి డ్యాన్సింగ్ వీడియో సంగతి అయితే చెప్పక్కర్లేదు.

నిన్న మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, కార్తికేయ, పూజల పెళ్ళి వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు మరో కొత్త ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పెళ్ళికి జైపూర్ వెళ్ళేటప్పుడు, ఎన్టీఆర్, చరణ్, అనుష్క ముగ్గురూ విమాన సిబ్బందితో ఫోటో దిగారు. ఎన్టీఆర్, చరణ్, అనుష్క పక్క పక్కనే నిలబడగా, వారి పక్కన సిబ్బంది నిలబడి పిక్స్ తీసుకున్నారు. ఈ ఫోటోని తారక్, చెర్రీ అండ్ స్వీటీ ఫ్యాన్స్ తెగ షేర్ చేసేస్తున్నారు.

 

Exit mobile version