RRR : ప్రేక్షకులకు, అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాని సక్సెస్ చేసినందుకు అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ ట్విట్టర్ లో.. ''ఆర్ఆర్ఆర్ విజయవంతం చేసిన ప్రేక్షకులకు.........
- Saketh U
- Published on- March 26, 2022 / 06:48 AM IST
Ntr
NTR : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిన్న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు బెనిఫిట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంది. సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు, సెలబ్రిటీలు సినిమాపై, రాజమౌళి, తారక్, చెర్రీలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిమానులు సినిమా హిట్ అయినందుకు సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు.
Sukumar: రాజమౌళి సార్.. అంటూ RRRపై సుక్కు కామెంట్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని సక్సెస్ చేసినందుకు అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ ట్విట్టర్ లో.. ”ఆర్ఆర్ఆర్ విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్రేక్షకుల ప్రేమ, అభిమానం, మద్దతు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ప్రేక్షకుల అమితమైన ప్రేమకు ధన్యవాదాలు. అద్భుతమైన దృశ్యాలతో కూడిన ఆర్ఆర్ఆర్ ను ఆస్వాదించండి.” అంటూ ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లు, అభిమానులు ఈ ట్వీట్ ని షేర్ చేశారు.
