Sukumar: రాజమౌళి సార్.. అంటూ RRRపై సుక్కు కామెంట్!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎవరి నోట విన్నా ఆర్ఆర్ఆర్ అని ఒకటే పేరు వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్.....

Sukumar: రాజమౌళి సార్.. అంటూ RRRపై సుక్కు కామెంట్!

Sukumar Interesting Comment On Rrr Movie

Updated On : March 25, 2022 / 7:55 PM IST

Sukumar: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎవరి నోట విన్నా ఆర్ఆర్ఆర్ అని ఒకటే పేరు వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను బాహుబలి చిత్రం తరువాత తెరకెక్కించడంతో RRR మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అంచనాలు తారాస్థాయికి చేరాయి. దీంతో తొలిరోజే ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. కరోనా ప్రభావం తరువాత ఇంతగా జనం థియేటర్లు ఎగబడటం కేవలం ఆర్ఆర్ఆర్ చిత్రంతోనే సాధ్యమైంది.

RRR: ఇకపై నాన్ RRR.. క్లారిటీ ఇచ్చిన బాహుబలి నిర్మాత!

ఇక ఈ సినిమాను ఇండస్ట్రీలోని సెలబ్రిటీల నుండి మొదలుకొని సామాన్య ఆడియెన్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన జక్కన్నకు హ్యాట్సాఫ్ చెబుతూ అందరూ సోషల్ మీడియాలో ఆయన్ను ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసిన మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా జక్కన్న గురించి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

‘‘మీరు పక్కనే వున్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి.. మేం ఆకాశంలో వున్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి.. రాజమౌళి సార్.. మీకూ మాకూ ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు మేం చూడగలం అంతే..’’ అంటూ సుకుమార్ రాజమౌళిని పొగిడిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్‌ను నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. జక్కన్న లాంటి వారే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు తీయగలరని సుకుమార్ తన పోస్ట్ ద్వారా తెలియజేశాడు.

Sukumar : వరుస పాన్ ఇండియా లైనప్‌తో సుకుమార్

ఇక సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప పార్ట్ 2 తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పుష్ప తొలిభాగం ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా సుకుమార్ తెరకెక్కిస్తుండటం విశేషం.

Suku About Rrr