RRR: ఇకపై నాన్ RRR.. క్లారిటీ ఇచ్చిన బాహుబలి నిర్మాత!
ఇండియన్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తాజాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను అల్లాడిస్తోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా,...

Baahubali Producer About Non Rrr Records
RRR: ఇండియన్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తాజాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను అల్లాడిస్తోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను అత్యంత భారీ అంచనాల నడుమ చిత్ర యూనిట్ భారీ స్థాయిలో రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు అన్ని చోట్లా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది.
RRR: ‘ఆర్ఆర్ఆర్’ను కూడా వాడుకుంటున్న అమూల్!
దీంతో ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ షోతో ‘బాహుబలి 2’ చిత్ర రికార్డును దాటేసిన ఆర్ఆర్ఆర్, మరిన్ని రికార్డులపై కన్నేసింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణతో నాన్-బాహుబలి రికార్డు అనే పేరు కూడా మాయం కానుందని ఆర్ఆర్ఆర్ అభిమానులు అంటున్నారు. అయితే ఈ విషయంపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఓ ట్వీట్ చేశారు. ఆయన ‘‘ఇకపై నాన్-బాహుబలి కాదు.. నాన్-RRR’’ అంటూ ట్వీట్ చేశారు.
RRR: ఓటీటీలో ట్రిపుల్ఆర్.. ఎప్పుడు.. ఎక్కడంటే?
ఈ ట్వీట్‌తో బాహుబలి చిత్ర ప్రొడ్యూసర్ కూడా ఆర్ఆర్ఆర్కు సెల్యూట్ కొడుతున్నాడని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. కాగా తారక్-చరణ్‌ల పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. కొమురం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్‌లు విధ్వంసకరమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారని.. జక్కన్న ఈ సినిమాను చెక్కిన తీరు అమోఘం అంటున్నారు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు.
ఇక అజయ్ దేవ్గన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలివియా మారిస్ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా తొలిరోజు ఎంతమేర కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి అంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్.