NTR : ఎన్టీఆర్ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదా.. కష్టంగానే వచ్చాడా? నిర్మాత చెప్పినా ‘డ్రాగన్’ రిలీజ్ పై సందేహమే..

తాజాగా చాన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ నిన్న ఫ్యాన్స్ ముందుకు, మీడియా ముందుకు వచ్చారు.(NTR)

  • Published on- September 30, 2026 / 03:08 PM IST

NTR

NTR : ఎన్టీఆర్ చెయ్యికి అయిన ఆపరేషన్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదా అంటే అవుననే అనిపిస్తుంది. ఇటీవల డ్రాగన్ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ భుజానికి గాయమయి, ఆపరేషన్ జరిగింది. పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుండి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. తాజాగా చాన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ నిన్న ఫ్యాన్స్ ముందుకు, మీడియా ముందుకు వచ్చారు.

ఫహద్ ఫాజిల్ హీరోగా రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాణంలో తెరకెక్కిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా జరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ మొత్తంలో ఎక్కడా కూడా తన కుడి చెయ్యిని పైకి లేపలేదు. సాధారణంగా ఎన్టీఆర్ స్టేజిపైకి వస్తే కుడి చేత్తోనే అభివాదం చేస్తారు. కానీ నిన్న ఎడమ చేత్తో అభివాదం చేసారు. కుడి చేతిని అసలు పైకెత్తలేకపోయారు. మైక్ కూడా ఎడమ చేత్తోనే పట్టుకొని మాట్లాడారు. కుడి చేతిని కదల్చకుండా నిటారుగా అలాగే ఉంచారు. నిన్న ఈవెంట్ అంతా గమనిస్తే అసలు కుడి చేతితో ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడం చేయలేదు, ఎవర్ని కుడి చేతి దగ్గరికి రానివ్వలేదు. దీంతో ఎన్టీఆర్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Also Read : Si Yugandhar : రెండు రోజుల్లో సినిమా రిలీజ్.. హీరోనే పట్టించుకోవట్లేదు.. మొన్నే హిట్ కొట్టి ఇప్పుడేమో ఇలా..

తాజాగా నిన్న ఓ అభిమానిని కలిసిన వీడియో ఇవాళ రిలీజ్ చేసారు. ఆ వీడియోలో ఎన్టీఆర్ కుడిచేతికి సపోర్ట్ బెల్ట్ పౌచ్ పెట్టుకొని ఉన్నారు. ఈ వీడియోతో పూర్తిగా క్లారిటీ వచ్చేసింది ఎన్టీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని. ఇప్పటికే ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా అనేకసార్లు వాయిదా పడింది. నిన్న ఈవెంట్లో డ్రాగన్ సినిమా చెప్పిన డేట్ కి 2027 జూన్ 11న రిలీజ్ అవుతుందని నిర్మాత మైత్రి రవిశంకర్ తెలిపారు. త్వరలోనే అక్టోబర్ రెండో వారంలో మిగిలిన షూటింగ్ మొదలవుతుందని టాక్.

అయితే నిర్మాత అంత కాన్ఫిడెంట్ గా చెప్పినా నిన్న ఎన్టీఆర్ చెయ్యి పరిస్థితి చూసిన తర్వాత డ్రాగన్ రిలీజ్ పై సందేహమే నెలకొంది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్నాకే డ్రాగన్ షూట్ కి వెళ్ళాలి. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లు కూడా షూట్ చేయాలి. మరి ఎన్టీఆర్ చెయ్యి పూర్తిగా సెట్ అవ్వకుండానే షూటింగ్ చేసి చెప్పిన డేట్ కి డ్రాగన్ రిలీజ్ చేస్తారా చూడాలి.

Also Read : NTR : మూగ అభిమాని కోసం.. చేతికి ఉన్న పౌచ్ తీసేసి మరీ హగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..