Ntr team: ఎన్టీఆర్ పేరుతో మోసాలు.. వారిని నమ్మకండి.. హీరో ఆఫీస్ సీరియస్ వార్నింగ్
ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రెస్ నైట్ విడుదల చేసిన టీం(Ntr team).
- V Santhosh Kumar
- Updated on- May 13, 2026 / 09:57 PM IST
NTR Team Issues Press Note about Fraud Committed in His Name
- ఎన్టీఆర్ పేరుతో నకిలీ విరాళాలు.
- అభిమానులు మోసపోవద్దని హీరో హెచ్చరిక.
- అధికారిక ప్రకటన ఉంటేనే నమ్మండి.
Ntr team: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కార్యాలయం నుండి తాజాగా ఒక కీలక అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్టీఆర్ పేరుతో కొన్ని అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజల నుండి విరాళాలు సేకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఇటువంటి వసూళ్లతో కానీ, కార్యక్రమాలతో కానీ ఎన్టీఆర్‌కు గానీ, ఆయన కార్యాలయానికి గానీ ఎలాంటి సంబంధం లేదని వారు కుండబద్దలు కొట్టారు.
Manchu Lakshmi: మంచు లక్ష్మి గ్లామర్ అటాక్.. పొట్టి నిక్కర్‌లో స్టన్నింగ్ ఫోటోలు వైరల్
ఎన్టీఆర్ ఆమోదం లేకుండా ఆయన పేరును వాడుకుంటూ చేపడుతున్న ఇలాంటి వ్యక్తిగత కార్యక్రమాలకు ఎవరూ విరాళాలు ఇచ్చి మోసపోవద్దని ప్రజలను, అభిమానులను కోరారు. ఏవైనా సామాజిక కార్యక్రమాలు లేదా సేవా పనులు ఉంటే, అవి నేరుగా ఎన్టీఆర్ ద్వారా లేదా ఆయన అధికారిక బృందం ద్వారానే వెల్లడి చేయబడతాయని స్పష్టం చేశారు. నకిలీ విరాళాల సేకరణ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రకటన ద్వారా హెచ్చరించారు.
