NTR Trivikram : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా అనౌన్స్.. గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ వచ్చేసింది..
నేడు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. (NTR Trivikram)
- Saketh U
- Updated on- June 29, 2026 / 05:18 PM IST
NTR Trivikram
NTR Trivikram : కుమారస్వామి కథతో గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా త్రివిక్రమ్ డ్రీం ప్రాజెక్ట్ అని నిర్మాత నాగవంశీ గతంలో తెలిపారు. మొదట ఈ సినిమా ఎన్టీఆర్ తోనే ప్లాన్ చేసారు. మధ్యలో అల్లు అర్జున్ తో కూడా తీస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ఎన్టీఆర్ తోనే తీస్తున్నారు అని గత కొని రోజుల నుంచి వార్తలు రాగా నాగ వంశీ రెండు రోజుల నుంచి ట్విట్టర్ ద్వారా హింట్స్ ఇస్తూ వస్తున్నారు.
నేడు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమాని ప్రకటించారు. ఒక త్రిశూలం, ఆ త్రిశూలానికి DNA లింక్ అయి ఉన్న పోస్టర్ తో సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్ ని ఎన్టీఆర్ షేర్ చేసి.. శివుని కుమారుడు. పార్వతీదేవి గర్వకారణం. శాశ్వత సేనాని అని రాసుకొచ్చారు. ఇదే పోస్టర్ ని హారిక హాసిని క్రియేషన్స్ షేర్ చేసి.. ఉత్తరాన పుట్టింది. మధ్యభూమిలో రూపుదిద్దుకుంది. దక్షిణాన పూజించబడింది. ఇప్పుడు విశ్వానికి చెందవలసిన ఒక గాథ అని రాసుకొచ్చారు.
Also See : Nabha Natesh : నాగబంధం ప్రమోషన్స్‌లో నభా నటేష్.. చీరకట్టులో ముద్దుగుమ్మ..
అయితే ఇది కుమార స్వామి కథగా, తల్లి కొడుకు ఎమోషన్ తో మైథలాజికల్ సినిమాగా తెరకెక్కుతుందని, ఇందులో ఎన్టీఆర్ కుమారస్వామిగా కనిపిస్తాడని నాగవంశీ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. త్రివిక్రమ్ పెన్ పవర్, ఆయన సృష్టించే కొత్త ప్రపంచం చూస్తారు అని నేడు ఓ ట్వీట్ తో నాగవంశీ ఈ సినిమాపై హైప్ పెంచారు. ఈ సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించకపోయినా గాడ్ ఆఫ్ వార్ అని నాగవంశీ చెప్పడంతో ఆ టైటిల్ బాగా ప్రచారం అయింది. అయితే సంసృతంలో కుమారస్వామికి ఉండే పేర్లతోనే ఈ సినిమా టైటిల్ ఉంటుందని తెలుస్తుంది.
ఇటీవల అందరూ పీరియాడిక్,మైథలాజి కథలతో భారీ సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అదే బాట పట్టారు. దీంతో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చే ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించనున్నాడు. గతంలో త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో అరవయిందా సమేత వీరరాఘవ సినిమా వచ్చి మంచి విజయం సాధించింది.
The Son of Shiva.
The Pride of Parvathi.
The Eternal Commander.And, once again with TRIVIKRAM.#NTRxTrivikram pic.twitter.com/oIW7o4PETu
— Jr NTR (@tarak9999) June 29, 2026
