God Of War : మొదలైన ఎన్టీఆర్ త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా పనులు.. ఫొటోలు వైరల్.. ఫ్యాన్స్ ఖుషీ..

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ తో గాడ్ ఆఫ్ వార్ సినిమా చేయబోతున్నాడు. (God Of War)

  • Updated on- November 13, 2026 / 03:12 PM IST

God Of War

God Of War : ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ తో గాడ్ ఆఫ్ వార్ సినిమా చేయబోతున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ ఆధారంగా మైథాలజీ మిక్స్ చేసి ఈ సినిమాని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా అనధికారికంగా లీక్ అయినప్పటి నుంచే దీనిపై అంచనాలు ఉన్నాయి.

ఇటీవలే త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం సినిమాతో వచ్చాడు. ఆ సినిమా తర్వాత ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్టు అధికారికంగా ప్రకటించడానికి ఫ్యాన్స్ కోసం స్పెషల్ ఫోటో రిలీజ్ చేసారు. తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్, ఈ సినిమా నిర్మాతలు కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది మూవీ యూనిట్. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Also See : Amardeep Chowdary : అయ్యప్పస్వామి పడిపూజ నిర్వహించిన సీరియల్ నటులు.. అమర్ దీప్, మానస్ నాగులపల్లి ఫొటోలు..

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తుండగా 2027 సంక్రాంతి తర్వాత ఈ కొత్త సినిమా షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. ఇప్పుడు ఈ ఫోటోలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అరవింద సమేత సినిమా తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలిసి పనిచేయడం, మైథలాజి కాన్సెప్ట్ కావడంతో రిలీజ్ కి ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.