NTR Trivikram : ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్ పై ఉన్న ‘సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం’ అర్ధం తెలుసా?
ఈ పోస్టర్ పై హిందీలో ఒక స్తోత్రం కూడా ఉంది. అది కుమారస్వామికి చెందిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. (NTR Trivikram)
- Saketh U
- Updated on- June 29, 2026 / 05:51 PM IST
NTR Trivikram
NTR Trivikram : నేడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఎప్పట్నుంచో కుమారస్వామి కథతో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారని, గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. నేడు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.
ఈ పోస్టర్ లో ఒక త్రిశూలం, ఆ త్రిశూలానికి మధ్యలో DNA లింక్ అయి ఉంది. దీంతో ఇది మనుషులు, దేవుళ్లను లింక్ చేస్తూ కథ ఉంటుందని, ఎన్టీఆర్ DNA సుబ్రహ్మణ్య స్వామి DNA తో లింక్ చేస్తూ కథ ఉంటుందని, ఎన్టీఆర్ కుమారస్వామిగా కనిపించబోతున్నాడని అంచనాలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. అలాగే ఈ పోస్టర్ పై హిందీలో ఒక స్తోత్రం కూడా ఉంది. అది కుమారస్వామికి చెందిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం.
Also Read : NTR Trivikram : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా అనౌన్స్.. గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ వచ్చేసింది..
పోస్టర్ పై ఉన్న సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం..
న జానామి శబ్దం న జానామి చార్థం
న జానామి పద్యం న జానామి గద్యమ్ ।
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే
ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్
దీని అర్ధం: నాకు శబ్దజ్ఞానం లేదు. నాకు పదాల అర్థం తెలియదు. నాకు పద్యాలు రచించడం రాదు. నాకు గద్యం చెప్పడం కూడా రాదు. అయినప్పటికీ ఆరు ముఖాలు కలిగిన ఆ పరమాత్మ నా హృదయంలో ప్రకాశిస్తుండటం వల్ల, నా ముఖం నుండి ఈ అద్భుతమైన మాటలు వాటంతట అవే వెలువడుతున్నాయి.
అలాగే ఈ పోస్టర్ పై ఓ ఇంగ్లీష్ కొటేషన్ కూడా ఉంది. దాని అర్ధం.. ఒకే ఈటె, ఒకే లక్ష్యం.. ఒకే దైవ తీర్పు అని. ఇలా ఈ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు నెలకొల్పారు. ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు అయ్యాక వీరిద్దరి కాంబోలో ఈ కుమారస్వామి సినిమా మొదలవుతుంది అని సమాచారం.
