NTR : ఎన్టీఆర్ డూప్ లేకుండా ఆ సినిమాలో యాక్షన్ సీన్స్ చేస్తున్నారా?

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర(Devara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీని తర్వాత YRF స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న వార్ 2(War) సినిమా షూట్ లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వనున్నాడు. హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ గా వార్ 2 సినిమా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ‘రా ఏజెంట్’ గా కనిపించబోతున్నాడని సమాచారం.

ఇప్పటికే వార్ 2 సినిమా ఒక షెడ్యూల్ షూట్ కూడా పూర్తిచేసేసింది. దేవర షూట్ అయ్యాక ఎన్టీఆర్ వార్ 2 షూట్ లో పాల్గొంటాడు. బాలీవుడ్ సినిమాల్లో, ముఖ్యంగా స్పై యూనివర్స్ సినిమాల్లో ఏ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ఉంటాయో అందరికి తెలిసిందే. భారీ యాక్షన్ సీక్వెన్స్ లని ఆల్మోస్ట్ డూప్స్ తోనే చేయిస్తారు. అయితే వార్ 2 సినిమాలో మాత్రం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ స్వయంగా యాక్షన్ సీన్స్ చేయబోతున్నారట.

Also Read : Gayathri Simhadri : వైరల్ అవుతున్న ‘కార్తీకదీపం’ సీరియల్ కొత్త నటి.. మోనిత పాత్రలో? ఎవరీమె?

ఇటీవల వార్ 2 టీం ఈ విషయాన్ని తెలిపింది. డూప్స్ తో హీరోలు లేకుండానే షూట్ చేస్తున్నారని బాలీవుడ్ లో ఈ సినిమాపై వార్తలు రావడంతో దీనిపై స్పందిస్తూ.. ఈ సినిమాలో డూప్స్ ఎవరూ చెయ్యట్లేదు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ స్వయంగా యాక్షన్ సీన్స్ డూప్స్ లేకుండా చేస్తారు అని తెలిపినట్టు బాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్ ని హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లో చూడాలని వార్ 2 సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శార్వరి అనే బాలీవుడ్ భామ నటించబోతున్నట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు