Gayathri Simhadri : వైరల్ అవుతున్న ‘కార్తీకదీపం’ సీరియల్ కొత్త నటి.. మోనిత పాత్రలో? ఎవరీమె?

కార్తీకదీపం సీరియల్ లో ఫిమేల్ సెకండ్ లీడ్ గా నటి, యాంకర్ గాయత్రీ సింహాద్రి నటిస్తోంది.

Gayathri Simhadri : వైరల్ అవుతున్న ‘కార్తీకదీపం’ సీరియల్ కొత్త నటి.. మోనిత పాత్రలో? ఎవరీమె?

Karthika Deepam Serial Telecasting from Today New Actress Gayathri Simhadri goes Viral

Updated On : March 25, 2024 / 3:26 PM IST

Gayathri Simhadri : తెలుగు సూపర్ హిట్ సీరియల్ కార్తీకదీపం(Karthika Deepam) ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. టీవీ టీఆర్పీ రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు సెట్ చేసింది కార్తీకదీపం. ఆ సీరియల్ కి సీజన్ 2 తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. కార్తీకదీపం నవ వసంతం పేరిట ఈ సీరియల్ సీజన్ 2 నేటి నుంచి టెలికాస్ట్ కానుంది. స్టార్ మా ఛానల్ లో నేడు మార్చ్ 25 నుంచి సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ కానుంది.

ఇప్పటికే కార్తీకదీపం నుంచి పలు ప్రోమోలు రిలీజ్ అయి వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్ లో మెయిన్ లీడ్స్ డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలను నిరుపమ్ పరిటాల, ప్రేమ్ విశ్వనాధ్ లే చేస్తున్నారు. ఆల్మోస్ట్ మిగతా పాత్రలు అందర్నీ మార్చేశారు. అయితే కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలతో పాటు మోనిత పాత్ర కూడా బాగా వైరల్ అయింది. గత సీజన్ లో మోనిత పాత్రలో శోభాశెట్టి నటించింది.

Also Read : Kangana Ranaut : లోక్‌సభ ఎన్నికల బరిలో బాలీవుడ్ క్వీన్ కంగనా.. పోటీ ఎక్కడి నుంచో తెలుసా?

ఇప్పుడు ఆ పాత్రలోకి కొత్త నటి వచ్చినట్టు తెలుస్తుంది. కార్తీకదీపం సీరియల్ లో ఫిమేల్ సెకండ్ లీడ్ గా నటి, యాంకర్ గాయత్రీ సింహాద్రి నటిస్తోంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ప్రోమోలలో గాయత్రీ సింహాద్రి కనపడింది. డాక్టర్ బాబు ఇంట్లో ఉండే అమ్మాయి పాత్రలాగే ఉంది. మోనిత పాత్ర లాగే ఈ పాత్ర కూడా ఉండబోతుందని సమాచారం. డాక్టర్ బాబుని ప్రేమించే పాత్రలో గాయత్రీ సింహాద్రి నటిస్తున్నట్టు తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Gayathri Munni Simhadri (@gayathrisimhadrii)

ఇక గాయత్రి సింహాద్రి ముద్దమందారం, త్రినయని లాంటి పలు సీరియల్స్, జోష్ షోలో యాంకర్ గా, పలు టీవీ షోలలో కనిపించింది. ఇప్పుడు ఏకంగా కార్తీకదీపం సీజన్ 2లో ముఖ్య పాత్ర ఛాన్స్ కొట్టేసింది. ఈ సీరియల్ లో గాయత్రీ సింహాద్రి ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. కార్తీకదీపం అభిమానులు నేటి నుంచి సీరియల్ చూడటానికి రెడీ అయిపోతున్నారు.