Kangana Ranaut : లోక్‌సభ ఎన్నికల బరిలో బాలీవుడ్ క్వీన్ కంగనా.. పోటీ ఎక్కడి నుంచో తెలుసా?

బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఎన్నికల బరిలో నిలబడుతోంది.

Kangana Ranaut : లోక్‌సభ ఎన్నికల బరిలో బాలీవుడ్ క్వీన్ కంగనా.. పోటీ ఎక్కడి నుంచో తెలుసా?

Kangana Ranaut Contesting Lok Sabha Polls 2024 from BJP

Updated On : March 25, 2024 / 6:50 AM IST

Kangana Ranaut : బాలీవుడ్(Bollywood) క్వీన్ కంగనా రనౌత్ సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తుంది. త్వరలో ఎమర్జెన్సీ సినిమాతో రాబోతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ, బాలీవుడ్ మాఫియాపై, దేశంలోని సమస్యలపై స్పందిస్తూ ఉంటుంది. తనని విమర్శించే వారిపై రెగ్యులర్ గా కౌంటర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తుంది.

ఇప్పుడు ఈ బాలీవుడ్ భామ ఎన్నికల బరిలో నిలబడుతోంది. ఎప్పట్నుంచో కంగనా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తుంది. కంగనా కుటుంబంలో కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. తాజాగా ఇప్పుడు కంగనా రనౌత్ కి బీజేపీ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన బీజేపీ ఐదో జాబితాలో కంగనా రనౌత్ పేరు ఉంది. కంగనా తన సొంత నియోజకవర్గం, పుట్టి పెరిగిన ఊరు హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి పోటీ చేయనుంది. ఇన్నాళ్లు నటిగా రాణించిన కంగనా ఇప్పుడు ఎంపీగా గెలుస్తుందా చూడాలి.

Also Read : Samantha : ఫ్యాన్స్ మీటింగ్ పెట్టిన సమంత.. అభిమానులతో పాటు ఎమోషనల్ అయిన సమంత.. ఫోటోలు వైరల్..

ఇక బీజేపీ సీట్ ఇవ్వడంతో దీనిపై కంగనా స్పందిస్తూ.. నేను భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నాను. బీజేపీ నేషనల్ లీడర్స్ నాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చి నేను పుట్టిన ప్లేస్ మండీ ఎంపీ సీట్ నాకు కేటాయించారు. వారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. అధికారికంగా బీజేపీలో జాయిన్ అయినందుకు నేను గౌరవంగా ఫీల్ అవుతున్నాను. బీజేపీ కార్యకర్తగా, పబ్లిక్ సర్వెంట్ గా ఇకపై పని చేస్తాను అని తెలిపింది. అలాగే ఈ జాబితాలో బాలీవుడ్ సూపర్ హిట్ సీరియల్ రామాయణ్‌ లోని రాముడి పాత్ర పోషించిన అరుణ్‌ గోవిల్‌కు మీరట్‌ సీటు కేటాయించింది బీజేపీ.

Kangana Ranaut Contesting Lok Sabha Polls 2024 from BJP