Nupur Sanon : టైగర్ నాగేశ్వరరావు హీరోయిన్ లవ్ ఫెయిల్యూర్.. ఆ బాధతో అర్ధరాత్రి బాత్రూంలో..

నుపుర్ సనన్ హీరోయిన్ కృతి సనన్ కి సొంత చెల్లి. నుపుర్ మోడల్ గా, పలు ప్రైవేట్ ఆల్బమ్స్ తో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.

Nupur Sanon shares her Love Breakup Story in Tiger Nageswara Rao Promotions

Nupur Sanon : రవితేజ (Raviteja) హీరోగా ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’(Tiger Nageswararao) సినిమా రాబోతుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై ద‌ర్శ‌కుడు వంశీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీలో బాలీవుడ్ భామ‌లు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) హీరోయిన్స్ గా నటించారు. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది.

దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ వీర లెవల్లో చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన నుపుర్ సనన్ హీరోయిన్ కృతి సనన్ కి సొంత చెల్లి. నుపుర్ మోడల్ గా, పలు ప్రైవేట్ ఆల్బమ్స్ తో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలుపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ బ్రేకప్ గురించి మాట్లాడింది.

Also Read : Rathika Rose : స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ రతిక.. స్వయంగా పోస్ట్ చేసి..

టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నుపుర్ సనన్ యిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎవర్నైనా ప్రేమించారా అని అడగ్గా.. కాలేజీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. సీరియస్ గా ప్రేమించాను. కానీ అతను నన్ను మోసం చేస్తున్నాడు అని అర్ధమయ్యేసరికి అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి, అతన్ని గుడ్డిగా నమ్మేశాను. నా లవ్ ఫెయిల్ అయ్యాక చాలా ఏడ్చాను, బాధపడ్డాను. ఇంట్లో వాళ్ళకి ఎక్కడ తెలుస్తుందో అని అర్ధరాత్రి బాత్రూంలోకి వెళ్లి మరీ ఏడ్చేదాన్ని. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది అని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు