భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చెయ్యడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.. రామ్ చరణ్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన వినయ విధేయ రామ, సంక్రాంతి స్పెషల్‌గా, జనవరి 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో చరణ్ అభిమానులకు, ప్రేక్షకులకూ ఊహించని షాక్ ఇచ్చాడు బోయపాటి. రోటీన్ స్టోరీ, ఊరమాస్ యాక్షన్ సీన్లు, ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ని ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి. యక్షన్ సీన్స్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ అయ్యాక సైలెంట్‌గా ఉన్న చరణ్.. రీసెంట్‌గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు..
అభిమానులను, ప్రేక్షకులను ఉద్దేశించి, తన సినిమాల పట్ల వారు చూపుతున్న ఆదరణకు వినమ్ర పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, వినయ విధేయ రామ సినిమా కోసం కష్టపడిన నిర్మాత దానయ్య, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, అనుకున్న విధంగా ఒక మంచి సినిమాని అందించలేక, మీ అంచనాలను అందుకోలేక పోయాం.. భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చెయ్యడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను అంటూ.. ఎల్లప్పుడూ తనకు మద్దతు అందించిన మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు రామ్ చరణ్…
వాచ్ చరణ్ ప్రెస్ నోట్…