×
Ad

OG Bookings : వామ్మో ఇదెక్కడి హైప్ రా బాబు.. ఒక్క సిటీలో 550 షోలు హౌస్ ఫుల్.. రిలీజ్ కి రెండు రోజుల ముందే..

రెండు రోజుల ముందే OG టికెట్స్ అన్ని సేల్ అయిపోతున్నాయి. (OG Bookings)

OG Bookings

OG Bookings : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమాకు భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. రేపు రాత్రికే ప్రీమియర్ షోలు పడనున్నాయి. ప్రీమియర్స్ కి బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోయినా 25 నుంచి బుకింగ్స్ ఓపెన్ చేసారు. రెండు రోజుల ముందే టికెట్స్ అన్ని సేల్ అయిపోతున్నాయి. కలెక్షన్స్ వరద పారుతుంది.(OG Bookings)

OG హైప్ టికెట్ బుకింగ్స్ లో తెలిసిపోతుంది. ఒక్క హైదరాబాద్ లోనే అన్ని మాల్స్, సింగిల్ స్క్రీన్స్ , మల్టిప్లెక్స్ స్క్రీన్స్ కలుపుకొని 25 ఒక్కరోజే 550 కు పైగా షోలు వేస్తుండగా అవన్నీ హౌస్ ఫుల్ అయిపోయాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్ లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఒక హైదరాబాద్ లోనే అన్ని షోలు టికెట్స్ అముడయ్యాయంటే ఇక తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో OG హైప్ ఏ రేంజ్ ఉందో అర్థమైపోతుంది.

Also See : Janhvi Kapoor : తల్లి శ్రీదేవి చీర కట్టుకొచ్చిన జాన్వీ కపూర్.. ఫొటోలు వైరల్..

ఈ సినిమా హైప్ చూసి మరిన్ని స్క్రీన్స్ OG కోసమే యాడ్ చేయడానికి చూస్తున్నారు. ఇవి కాక ప్రీమియర్స్ కి కూడా టికెట్ బుకింగ్స్ రేపు ఓపెన్ చేస్తారని తెలుస్తుంది. వాటి కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ లెక్కన దసరా హాలిడేస్, వీకెండ్ ఉంది కాబట్టి OG సినిమాకు ఓ నాలుగు రోజుల దాకా హౌస్ ఫుల్స్ పడటం ఖాయమంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలయిందని సమాచారం.


Also Read : Sujeeth : సుజీత్ చెప్పిన వెబ్ సైట్ ఓపెన్ చేశారా? అందులో ఏముంది? ఏం కంటెంట్ ఇస్తాడు? OG ప్రీక్వెల్..?