OG Pre Release Event : పవన్ కళ్యాణ్ OG ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ? రూమర్స్ వైరల్..

పవన్ కళ్యాణ్ OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై రూమర్స్ వైరల్ అవుతున్నాయి. (OG Pre Release Event)

OG Pre Release Event

OG Pre Release Event : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు పూర్తి చేస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు సినిమాతో వచ్చి నిరాశపరిచినా త్వరలో OG సినిమాతో రాబోతున్నాడు. OG సినిమాపై భారీ హైప్ ఉంది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినిమా లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ OG సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.(OG Pre Release Event)

అయితే హరిహర వీరమల్లు సినిమాకు చేసిన రేంజ్ లో ప్రమోషన్స్ చేయకపోయినా OG సినిమాకు కూడా సింపుల్ గా ప్రమోషన్స్ చేస్తారని సమాచారం. ఈ క్రమంలో OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read : Mouli Tanuj : వీడు కదా నాని డై హార్డ్ ఫ్యాన్ అంటే.. నానిని కలిసే అవకాశం వచ్చినా కలవకుండా.. సినిమా హిట్ కొట్టి..

పవన్ కళ్యాణ్ OG సినిమా హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్ మెట్టి పవన్ కళ్యాణ్, మూవీ యూనిట్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతారట. అలాగే OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో సెప్టెంబర్ 20న నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నాడు అని తెలుస్తుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ OG ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.