Mouli Tanuj : వీడు కదా నాని డై హార్డ్ ఫ్యాన్ అంటే.. నానిని కలిసే అవకాశం వచ్చినా కలవకుండా.. సినిమా హిట్ కొట్టి..

తాజాగా నాని డై హార్డ్ ఫ్యాన్ అంటూ లిటిల్ హార్ట్స్ సినిమా హీరో మౌళి తనూజ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.(Mouli Tanuj)

Mouli Tanuj : వీడు కదా నాని డై హార్డ్ ఫ్యాన్ అంటే.. నానిని కలిసే అవకాశం వచ్చినా కలవకుండా.. సినిమా హిట్ కొట్టి..

Mouli Tanuj

Updated On : September 9, 2025 / 4:25 PM IST

Mouli Tanuj : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి స్టార్ గా ఎదిగిన హీరోల్లో నాని ఒకరు. నాని కూడా తన నటన, సింప్లిసిటీతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇటీవల వరుసగా సినిమాలు హిట్ కొడుతుండటంతో నానికి కూడా ఫ్యాన్స్ బాగానే పెరిగారు. తాజాగా నాని డై హార్డ్ ఫ్యాన్ అంటూ ఓ నటుడు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.(Mouli Tanuj)

సోషల్ మీడియా రీల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న మౌళి తర్వాత నటుడిగా మారాడు. ఇప్పుడు హీరోగా లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఈ సినిమా కేవలం 2 కోట్లతో తీస్తే ఏకంగా 15 కోట్లు వసూలు చేసి దూసుకుపోతుంది. ఈ సినిమాని ప్రేక్షకులే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా అభినందిస్తున్నారు. ఈ క్రమంలో నాని లిటిల్ హార్ట్స్ సినిమా చూసి ట్వీట్ చేసారు.

Also Read : Teja Sajja : నిర్మాతలకు డైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చిన తేజ సజ్జా.. ఇప్పటికైనా మారతారా?

నాని తన ట్వీట్ లో.. లిటిల్ హార్ట్స్ అదిరిపోయే కామెడీ సినిమా. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. అఖిల్, మధు, కాత్యాయని మీరంతా నా రోజుని స్పెషల్ చేశారు. నేను ఐ లవ్ యు చెప్పను కానీ థ్యాంక్యూ చెప్తాను అని రాసి మూవీ యూనిట్ ని అభినందించాడు. దీంతో ఈ ట్వీట్ కి మౌళి రిప్లై ఇచ్చాడు.

మౌళి నాని ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. థ్యాంక్యూ సో మచ్ నాని అన్న. నీకు తెలియకపోవచ్చు కానీ నేను నీకు పెద్ద ఫ్యాన్ ని నీ పిల్ల జమిందార్ సినిమా నుంచి. గతంలో నిన్ను ఒకసారి కలిసే ఛాన్స్ వచ్చింది కానీ నేను కలవలేదు. ఒక మాములు ఫ్యాన్ లాగా కాకుండా నా వర్క్ తెలిసాకే కలుద్దాం అని ఫిక్స్ అయ్యాను. దాని కోసం నేను పనిచేసాను ఇవాళ సాధించాను. మౌళి నానికి డై హార్డ్ ఫ్యాన్ ఎప్పటికి. ఈ రోజు కొత్త ఛాలెంజ్ పెట్టుకున్నా ఏదో ఒక రోజు నీ గోడలో ఇటుక అవుతా పక్కా అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకూడదు అంట.. హైకోర్టులో పిటిషన్..

నాని గతంలో తను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్న కొత్త నటీనటులను, దర్శకులను ఉద్దేశించి నేను బలంగా ఒక గోడ తయారు చేస్తున్నాను అందుకు ఒక్కో ఇటుక పేరుస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు మౌళి నాని కట్టే గోడలో ఇటుక అవుతాను అనడంతో భవిష్యత్తులో మౌళి నానితో కానీ, నాని నిర్మాణ సంస్థలో కానీ నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక నాని ఫ్యాన్స్ మౌళి ని ఆకాశానికెత్తేస్తున్నారు.