Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకూడదు అంటూ.. హైకోర్టులో పిటిషన్..
రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకూడదు అంటూ హైకోర్టు లో పిటిషన్ వేశారు.(Pawan Kalyan)

Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క సినిమాలు కూడా చేస్తున్నారు. తనకు ఉన్న ఒకేఒక ఆదాయమార్గం సినిమా అవడంతో పవన్ సినిమాలు చేస్తున్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొన్న రోజా వరకు చాలా మంది రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేసుకున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకూడదు అంటూ హైకోర్టు లో పిటిషన్ వేశారు.
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా నిలువరించాలని, హరిహర వీరమల్లు సినిమా, వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసారని, ప్రభుత్వ పదవిలో ఉండి ఆయన వ్యక్తిగత ప్రయోజనాలకు తన పదవి, అధికారాలను వాడుకున్నారని మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు.
Also See : Allu Arjun : అల్లు అర్జున్ నానమ్మ దశదిన కర్మ.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు.. ఫొటోలు..
తాజాగా దానికి సంబంధించిన విచారణ హైకోర్టులో జరిగింది. పవన్ కళ్యాణ్ తరపున అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ.. పదవుల్లో ఉన్న వ్యక్తులు సినిమాల్లో నటించడంపై నిషేధం లేదని, గతంలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు విస్తృత ధర్మాసనం ఈ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధర పెంపు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నట్లు పిటిషనర్ ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదని అన్నారు.
దీంతో పిటిషనర్ తరపు న్యాయవాదులు స్పందిస్తూ.. ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి, ఆధారాలు కోసం ప్రతి వాదనలు చెప్పేందుకు సమయం కోరారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
Also Read : Pawan Kalyan : అమెరికాలో పవన్ కళ్యాణ్ OG దూకుడు.. పుష్ప, దేవర, సలార్ రికార్డ్ లను బద్దలుకొట్టి..