×
Ad

OG Sequel : OG సీక్వెల్ అనౌన్స్.. ఓజీ 2 కథ ఇదే.. ఫ్యాన్స్ కి పండగే..

పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయను అనే ప్రకటించాడు. ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ సినిమా అని అంతా భావించారు. (OG Sequel)

OG Sequel

OG Sequel : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. నిన్నటి నుంచే ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా అదిరిపోయింది, సూపర్ హిట్, ముఖ్యంగా ఫ్యాన్స్ కి పండగే అంటున్నారు ప్రేక్షకులు. సుజీత్ ని అయితే నెత్తిన పెట్టుకుంటున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాక సాధారణ ప్రేక్షకులు కూడా OG సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు.(OG Sequel)

అయితే పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయను అనే ప్రకటించాడు. ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ సినిమా అని అంతా భావించారు. కానీ OG సినిమాకు వెళ్లిన ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. OG సీక్వెల్ ని ప్రకటించారు. OG సినిమా అంతా అయ్యాక చివర్లో OG 2 ఉన్నట్టు టైటిల్ కార్డు తోనే అనౌన్స్ చేసారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది కాబట్టి పవన్ ఓజీ 2 సినిమా కచ్చితంగా తీస్తాడు అని అంటున్నారు.

Also Read : They Call Him OG : ‘ఓజీ’ మూవీ రివ్యూ.. ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే.. ఓజస్ గంభీర విధ్వంసం..

OG సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర జపాన్ కి చెందిన సమురాయ్ అని చూపించారు. ఓజీ తన సమురాయ్ లందర్నీ యుకుజిలు చంపేయడంతో వాళ్లపై రివెంజ్ తీర్చుకున్నట్టు క్లైమాక్స్ లో హింట్ ఇచ్చేసారు. దీంతో జపాన్ యుకుజిల నాయకుడు ఓజీ కోసం వెతుకుతూ ఉంటాడు. మరో పక్క ముంబైలో ఓమిని చంపి బాంబ్ బ్లాస్ట్ లు జరగకుండా చేయడంతో డేవిడ్ భాయ్ కూడా ఓజీ పై పగ పెంచుకుంటాడు.

ఓజీని చంపడం కోసం డేవిడ్ భాయ్, జపాన్ యుకుజి లీడర్ చేతులు కలుపుతారు. దీంతో పార్ట్ 2 లో ఓజీ పోరాటం వీళ్ళిద్దరితో ఉంటుందని తెలుస్తుంది. అలాగే సత్య దాదా నుంచి వెళ్ళిపోయి కన్మణిని పెళ్లి చేసుకునే మధ్యలో కొన్నాళ్ళు ఓజీ జపాన్ లో ఉన్నాడని, అక్కడ చనిపోయినట్టు వార్తలు సృష్టించారని హింట్స్ ఇచ్చారు. దీంతో ఆ సమయంలో ఏం జరిగింది అని కూడా పార్ట్ 2 లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పార్ట్ 2 ఓజీ ని మించి యాక్షన్ సీక్వెన్స్ లతో జపాన్ బ్యాక్ డ్రాప్ తో ఉండనుంది. పవన్ ఫ్యాన్స్ అయితే కచ్చితంగా OG సీక్వెల్ చెయ్యాలి, ఆ సినిమాకి పవన్ డేట్స్ ఇవ్వాలి అని పోస్టులు చేస్తున్నారు.

Also See : Priyanka Mohan : రిలీజ్ కి ముందు OG హుడీతో ప్రియాంక స్పెషల్ ఫొటోలు..