స్టార్ట్, కెమెరా @ భారత్ ఫ్యూచర్ సిటీ.. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ ప్రముఖుల భేటీ.. త్వరలో..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ పెద్దలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటి జెనీలియా, అక్కినేని అమల, పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

స్టార్ట్, కెమెరా @ భారత్ ఫ్యూచర్ సిటీ.. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ ప్రముఖుల భేటీ.. త్వరలో..

CM Revanth Reddy meeting with Tollywood celebrities

Updated On : December 9, 2025 / 6:05 PM IST

Tollywood: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ పెద్దలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటి జెనీలియా, అక్కినేని అమల, పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో ఇండస్ట్రీకి సంబందించిన చాలా విషయాల గురించి చర్చించారు. అనంతరం రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Nivetha Pethuraj: మొన్నే కదా పెళ్లి అన్నారు.. అంతలో బ్రేకప్ చెప్పుకున్నారా?.. ఫోటోలు కూడా..

అలాగే, తాము నిర్మించబోయే ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించిన ముఖ్యమంత్రి, 24 క్రాఫ్ట్స్ లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే స్టూడియోల ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీపై ఆసక్తి ఉండి ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతున్న ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్ కోసం స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.