Laila : కొయ్ కొయ్.. కోడ్ని కొయ్.. విష్వక్ సేన్ లైలా సినిమాలో కుమ్మేశాడుగా..

విశ్వ‌క్ సేన్ లైలా మూవీ నుంచి మూడో పాట వ‌చ్చేసింది.

Laila : కొయ్ కొయ్.. కోడ్ని కొయ్.. విష్వక్ సేన్ లైలా సినిమాలో కుమ్మేశాడుగా..

Updated On : January 31, 2025 / 4:40 PM IST

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టిస్తున్న మూవీ లైలా. రామ్ నారాయ‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఆకాంక్ష శ‌ర్మ క‌థానాయిక‌. షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గార‌పాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. లియోన్‌ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వాలెంటైన్స్‌డే సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఒక్కో పాట‌ను విడుద‌ల చేస్తోంది. ఇప్ప‌టికే రెండు పాటల‌ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక తాజాగా మూడో పాటను రిలీజ్ చేసింది. ఓహో ర‌త్త‌మ్మ.. నాగ ర‌త్త‌మ్మ.. అంటూ ఈ పాట సాగుతోంది. పెంచ‌ల్ దాస్ ఈ పాట‌కు లిరిక్స్ అందించ‌డంతో పాటు పాడారు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Vishwambhara : చిరంజీవి విశ్వంభర VFX టీమ్ మారిందా? ఆ సెక్షన్ కి డైరెక్టర్ కూడా మారాడా?

విశ్వక్ ఈ మూవీలో బ్యూటీపార్లర్‌ నడిపించే మోడల్‌ సోనూగా, లైలా అనే అమ్మాయిగా రెండు పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రొమాన్స్‌, యాక్షన్‌, కామెడీ అంశాలతో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని చిత్ర బృందం చెబుతోంది.

శ్రీవారిని ద‌ర్శించుకున్న విశ్వ‌క్‌..
ఇదిలా ఉంటే.. శుక్ర‌వారం ఉద‌యం వీఐపీ ప్రారంభ విరామ ద‌ర్శ‌న స‌మ‌యంలో తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నాడు హీరో విశ్వ‌క్ సేన్‌. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం విశ్వ‌క్ మీడియాతో మాట్లాడారు.

Squid Game : స్క్విడ్ గేమ్.. సీజన్ 2 హిట్ అవ్వకపోయినా.. సీజన్ 3 రిలీజ్ డేట్ అనౌన్స్..

స్వామి వారి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరుకున్నారు. లైలా ట్రైలర్ ఫిబ్రవరి 6న రిలీజ్ కానున్న‌ట్లు చెప్పారు. ఫ్యామిలీ అంద‌రూ క‌లిసి చూసే కామెడీ చిత్రం లైలా మూవీ అని చెప్పుకొచ్చారు.