Squid Game : స్క్విడ్ గేమ్.. సీజన్ 2 హిట్ అవ్వకపోయినా.. సీజన్ 3 రిలీజ్ డేట్ అనౌన్స్..

తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్ 3 డేట్ కూడా అనౌన్స్ చేసారు.

Squid Game : స్క్విడ్ గేమ్.. సీజన్ 2 హిట్ అవ్వకపోయినా.. సీజన్ 3 రిలీజ్ డేట్ అనౌన్స్..

Netflix Announced Squid Game Season 3 Release Date

Updated On : January 31, 2025 / 11:45 AM IST

Squid Game : నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 2021లో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ పెద్ద హిట్ అయింది. వరల్డ్ వైడ్ అన్ని దేశాల్లో ఈ సిరీస్ హిట్ అయింది. దాంతో సీజన్ 2 కూడా ప్రకటించారు. స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఇటీవలే డిసెంబర్ 26న రిలీజయింది. అయితే సీజన్ 2కి సీజన్ 1 కి వచ్చినంత హైప్ రాలేదు. పైగా సీజన్ 2 బాగా సాగదీశారని, అంత ఆసక్తిగా లేదని చూసిన వాళ్ళు అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్ 3 డేట్ కూడా అనౌన్స్ చేసారు.

గతంలోనే స్క్విడ్ గేమ్ సీజన్ 3 కూడా ఉందని ప్రకటించారు. నేడు స్క్విడ్ గేమ్ పార్ట్ 3 రిలీజ్ డేట్ ప్రకటించారు. స్క్విడ్ గేమ్ సీజన్ 3 జూన్ 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. స్క్విడ్ గేమ్ ఇండియాలో పెద్ద హిట్ వ్వడంతో సీజన్ 2 లోకల్ భాషల్లో రిలీజ్ చేసారు. సీజన్ 3 కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

Also Read : Shah Rukh Khan – Allu Arjun : షారుఖ్ ఖాన్ – అల్లు అర్జున్ కలిసి యాడ్ చేస్తున్నారా.. బాలీవుడ్ లో ప్రమోషన్స్ వైరల్..

స్క్విడ్ గేమ్ సీజన్ 1 లో కొన్ని గేమ్స్ కు డేంజర్ రూల్స్, భారీ బహుమతులు, శిక్షలు పెట్టి ఆసక్తికరంగా డిజైన్ చేసారు. ఆ గేమ్ లో చాలా మంది చనిపోతారు. సీజన్ 1లో గేమ్ ని గెలిచి బయటకు వచ్చిన ఓ వ్యక్తి స్క్విడ్ గేమ్ సీజన్ 2 లో మళ్ళీ ఈ గేమ్ లోకి వస్తాడు. ఎలాగైనా ఈ ప్రమాదకరమైన గేమ్ ని ఆపాలని ట్రై చేస్తాడు. సీజన్ 2లో డ్రామా ఎక్కువగా నడిపించి గేమ్ ఉండాలా వద్దా అనే అంశాన్ని నడిపిస్తూ సాగదీశారు. దీంతో సీజన్ 2 అనుకున్నంత విజయం సాధించలేదు.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

Also Read : Anil Ravipudi – Ram : రామ్ – అనిల్ రావిపూడి గొడవ ఏంటి? వీళ్లిద్దరి సినిమా ఎందుకు ఆగిపోయింది? రామ్ చేయాల్సిన కథతో..

స్క్విడ్ గేమ్ సీజన్ 2 చివర్లోనే సీజన్ 3 కథకి లీడ్ ఇస్తారు. దీంతో సీజన్ 3లో ఈ గేమ్ ఆగుతుందా ఆగదా అనే క్లైమాక్స్ ఇస్తారని తెలుస్తుంది మరి సీజన్ 3 అయినా స్క్విడ్ గేమ్ సీజన్ 1 లాగా మెప్పిస్తుందా చూడాలి.