Shah Rukh Khan – Allu Arjun : షారుఖ్ ఖాన్ – అల్లు అర్జున్ కలిసి యాడ్ చేస్తున్నారా.. బాలీవుడ్ లో ప్రమోషన్స్ వైరల్..
అల్లు అర్జున్ పుష్ప 2తో నార్త్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు.

Allu Arjun and Shah Rukh Khan Doing Advertisement in Bollywood Promotions goes Viral
Shah Rukh Khan – Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంటే పుష్ప 2తో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. నార్త్ లో అయితే పుష్ప 2 భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రిలీజయిన 50 రోజుల వరకు కూడా థియేటర్స్ లో ఆడింది ఈ సినిమా. నార్త్ లో అయితే మొదటి రెండు వారాలు టికెట్స్ కోసం థియేటర్స్ వద్ద కొట్టుకున్నారు కూడా. అల్లు అర్జున్ నార్త్ ప్రేక్షకులకు ఆ రేంజ్ లో కనెక్ట్ అయ్యారు.
దీంతో అల్లు అర్జున్ కి నార్త్ నుంచి కూడా యాడ్స్ చేయమని ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ తెలుగులో థమ్స్ అప్ యాడ్ చేసారు. ఇప్పుడు నార్త్ లో కూడా థమ్స్ అప్ యాడ్ చేసాడని త్వరలోనే దాన్ని రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే కేవలం అల్లు అర్జున్ సింగిల్ గా కాదు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి థమ్స్ అప్ యాడ్ చేసాడట.
Also See : Vishwak Sen : తిరుమల వెంకన్న సన్నిధిలో విశ్వక్ సేన్.. ఫొటోలు చూశారా?
ఇప్పటికే ముంబైలో, బాలీవుడ్ వీధుల్లో షారుఖ్, అల్లు అర్జున్ ఫొటోలతో ప్రమోషన్ చేస్తున్నారు. థమ్స్ అప్ చూపించకుండా వీరిద్దరి ఫొటోలు ఒకే డిజైన్ తో విడివిడిగా హోర్డింగ్స్ పెట్టి ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ హోర్డింగ్ చూస్తే అది థమ్స్ అప్ యాడ్ అని, షారుఖ్ – అల్లు అర్జున్ కలిసి యాడ్ చేసారని తెలుస్తుంది. త్వరలోనే ఈ యాడ్ ని రిలీజ్ చేయబోతున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా తో బన్నీ కలిసి ఒక యాడ్ చేయడం, అది కూడా పాన్ ఇండియా యాడ్ కావడంతో ఫ్యాన్స్ పొంగిపోతున్నారు.
మరి త్వరలో రానున్న షారుఖ్ – అల్లు అర్జున్ థమ్స్ అప్ యాడ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇటీవల నార్త్ లో అల్లు అర్జున్ కి వచ్చిన క్రేజ్, ముఖ్యంగా మాస్ ఏరియాల్లో బన్నీకి వచ్చిన ఫాలోయింగ్ చూసి థమ్స్ అప్ నార్త్ లో కూడా బన్నీతో యాడ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో నార్త్ విలేజెస్ లో కూడా బన్నీ మరింత జనాల్లోకి వెళ్తాడని అనుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ త్వరలోనే త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. భారీ బడ్జెట్ తో మైథలాజికల్ సబ్జెక్టుతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు.