Vishwambhara : చిరంజీవి విశ్వంభర VFX టీమ్ మారిందా? ఆ సెక్షన్ కి డైరెక్టర్ కూడా మారాడా?

విశ్వంభర కంటెంట్‌పై ఒక అప్టేట్ కూడా బయటకు రావకపోవటంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

Vishwambhara : చిరంజీవి విశ్వంభర VFX టీమ్ మారిందా? ఆ సెక్షన్ కి డైరెక్టర్ కూడా మారాడా?

Megastar Chiranjeevi Vishwambhara Movie VFX Section Director Changed Rumors goes Viral

Updated On : January 31, 2025 / 2:19 PM IST

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో వస్తున్న విశ్వంభర సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ గేమ్‌ఛేంజర్ రేసులో ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వకపోవడంతో వాయిదా వేశారు. ఆల్రెడీ టీజర్‌ గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. కానీ తర్వాత అప్డేట్స్ కమింగ్‌ సూన్ అన్నట్లుగా మారిపోయింది సీన్. అయితే రిలీజయిన టీజర్‌పై మెగా ఫ్యాన్స్‌తో సహా అందరూ పెదవి విరవటంతో మూవీ యూనిట్ అలర్ట్ అయింది.

కంటెంట్ ఏంటో ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా టీజర్‌లో ఉన్న విజువల్ ఎఫెక్స్ట్‌పై మాత్రం పుల్ ట్రోల్స్ నడిచాయి. దీంతో గతంలో VFX కంపెనీని మార్చారని న్యూస్ వైరల్ అయింది. అది ఎంత వరకు నిజమో తెలియదు. ఆ తర్వాత సినిమా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ రిలీజ్‌ డేట్‌ సందర్భంగా విశ్వంభరను రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. అదీ కూడా క్లారిటీ లేదు.

Also Read : Coffee with a Killer : ఆహాలో మరో కొత్త క్రైం థ్రిల్లర్ సినిమా.. ‘కాఫీ విత్ ఏ కిల్లర్’.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దర్శకత్వంలో..

తాజాగా డైరెక్టర్ నాగ్‌ అశ్విన్ విశ్వంభర సినిమా VFX రీవర్క్ చేయిస్తున్నాడని మరో న్యూస్ వైరల్ అవుతోంది. విశ్వంభర సినిమాకు దర్శకుడు వశిష్ట అయితే VFX పై వచ్చిన ట్రోల్స్ తో కంపెనీని మార్చేసి ఆ సెక్షన్ వరకు కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి అప్పచెప్పారని టాక్ నడుస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి. దీనిపై కూడా మూవీ టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.

అసలు విశ్వంభర కంటెంట్‌పై ఒక అప్టేట్ కూడా బయటకు రావకపోవటంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. రిలీజ్ దాక ఇలానే చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గేమ్‌ఛేంజర్‌ రిలీజ్ వరకు కూడా ఏ మాత్రం కంటెంట్ వదలక పబ్లిసిటీలో వెనకబడిపోయారన్న టాక్ ఉంది. ఇప్పుడు విశ్వంభరకు సంబంధించి కూడా ఏ విషయాన్ని రిలీజ్‌ చేయకపోవడం ఏంటని కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. మెగాస్టార్‌కు జగదేక వీరుడు లాంటి బ్లాక్ బస్టర్ ఆశిస్తున్న ఫ్యాన్స్‌ మేకర్స్ నుంచి అదిరిపోయే ట్రైలర్‌ను ఊహిస్తున్నారు.

Also Read : Thandel Event : చెన్నైలో తండేల్ ఈవెంట్.. చీరలో సాయి పల్లవి.. గెస్ట్ గా కార్తీ.. ఫొటోలు చూశారా?

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర మూవీ షూట్‌ కంప్లీట్ అయిందని పోస్ట్ ప్రొడక్షన్‌ జరుగుతోందని తెలుస్తోంది. VFX రీషూట్ చేస్తున్నారని అంటున్నారు. ఇలా ఇప్పటివరకు ఈ మూవీ విషయంలో ఏ క్లారిటీ లేదు. అంతా గజిబిజి గందరగోళం కొనసాగుతోంది. దాంతో విశ్వంభర రిలీజ్‌ ఎప్పుడోనని ఈగర్లీగా వెయిట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్.