Coffee with a Killer : ఆహాలో మరో కొత్త క్రైం థ్రిల్లర్ సినిమా.. ‘కాఫీ విత్ ఏ కిల్లర్’.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దర్శకత్వంలో..
తెలుగు ఓటీటీ ఆహాలో మరో కొత్త సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

Aha OTT Sreaming New Movie Coffee with a Killer Directed by RP Patnaik
Coffee with a Killer : రెగ్యులర్ గా కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలు తీసుకొస్తున్న తెలుగు ఓటీటీ ఆహాలోకి మరో క్రైం థ్రిల్లర్ సినిమా వచ్చేసింది. ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ సినిమా నేడు జనవరి 31 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మాణంలో ఆర్ఫీ పట్నాయక్ దర్శకత్వంలో టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాపక, జెమిని సురేష్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమా తెరకెక్కింది.
Also See : Thandel Event : చెన్నైలో తండేల్ ఈవెంట్.. చీరలో సాయి పల్లవి.. గెస్ట్ గా కార్తీ.. ఫొటోలు చూశారా?
ఒక కాఫీ షాప్ లో వివిధ రకాల జనాలు ఉంటే అక్కడికి ఓ కిల్లర్ ఒకర్ని మర్డర్ చేయడానికి వస్తే ఏం జరిగింది అని క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు.
కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమా ఈవెంట్లో జెమిని సురేష్ మాట్లాడుతూ… ఈ సినిమాలో కాఫీ షాప్ మేనేజర్ పాత్ర పోషిస్తున్నాను. సినిమా అంతా నా చుట్టే తిరుగుతుంది. ఈ సినిమాలో కిల్లర్ ఎవరు? ఎవరిని చంపుతాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆహాలో ఈ చిత్రాన్ని చూడాల్సిందే. తెలుగు పరిశ్రమలో ఉన్న ఎంతో మంది కమెడియన్స్ కలిసి చాలా కాలం తర్వాత చేసిన సినిమా ఇది అని తెలిపారు. నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ… కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమా రెండు గంటలపాటు మిమ్మల్ని ఎక్కడికి కదలకుండా చేసే ఒక ప్రత్యేకమైన సినిమాగా ఉండబోతుంది. సినిమా అంటే పాటలు, యాక్షన్ లాంటి సీన్లతో కాకుండా ఒక కాన్సెప్ట్ ని కథగా అనుకుని సినిమాగా తీసాము అని అన్నారు.
Also Read : Squid Game : స్క్విడ్ గేమ్.. సీజన్ 2 హిట్ అవ్వకపోయినా.. సీజన్ 3 రిలీజ్ డేట్ అనౌన్స్..
నటుడు టెంపర్ వంశీ మాట్లాడుతూ… నన్ను మెయిన్ లీడ్ అని పెట్టి సినిమా తీయడం ఏంటి అని ఆశ్చర్యపోయాను. కథ చెప్పిన తర్వాత నాకు ఎంతో ఎగ్జైట్ గా అనిపించింది అని చెప్పారు. డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ… ఈ సినిమా ఆహాలో విడుదల అవ్వడానికి కారణమైన సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు. హీరో హీరోయిన్ లేకుండా ఒక సినిమా తీయాలి అనే ఆలోచనతో ఈ కథ మొదలైంది. సినిమాలో హీరో హీరోయిన్ ఉండరు కానీ విలన్ ఉంటాడు. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయమని చాలా మంది అడిగారు. కానీ ఇది ఓటీటీ సినిమానే. అందుకే ఆహాలో రిలీజ్ చేస్తున్నాము అని తెలిపారు.