Jailer : థియేటర్లో తమన్నాతో పోటీ పడి డ్యాన్స్ చేసిన వృద్ధుడు.. దద్దరిల్లిన సినిమా హాల్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జైలర్’. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
- Thota Vamshi Kumar
- Published on- August 14, 2023 / 04:45 PM IST
Old Man Dance Jailer song
Old Man Dance Jailer song : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జైలర్’(Jailer). ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లోనే 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది.
తమన్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, సునీల్ లు కీలక పాత్రల్లో నటించారు. చాలా కాలం తరువాత రజినీకాంత్ ఈ సినిమా ద్వారా బ్లాక్ బాస్టర్‌ను అందుకున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేదు. కాగా..మొదట్లో ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ట్రైలర్‌తో పాటు ‘కావాలయ్య’ పాట కూడా ఓ కారణం. ఈ పాటలో తమన్నా వేసిన సెప్టులకు అందరూ ఫిదా అయ్యారు.
మొదటి సింగిల్‌గా ఈ సాంగ్ వచ్చిన తరువాత ఈ పాట ఫీవర్ అందరిని తాకింది.ఫేస్బుక్, ఇన్‌స్ట్రామ్‌లో ఎందరో ఈ పాటకు రీల్స్ చేశారు. అయితే.. వీళ్లందరూ చేసిన దాని కంటే ఇప్పుడు ఓ తాత థియేటర్లో ఈ పాట వస్తున్నప్పుడు వేసిన స్టెప్పులు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. తమిళనాడులోని ఓ థియేటర్లో ఈ ఇది చోటు చేసుకుంది. తమన్నాతో పోటీ పడుతూ.. తాత డ్యాన్స్ చేస్తుండగా వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. తమన్నా కంటే తాతనే బాగా డ్యాన్స్ చేశాడని ఓ నెటీజన్ అనగా, ఇతడిని వృద్ధుడు అంటే ఎవరన్నా నమ్ముతారా అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం తాత డ్యాన్స్ పై మీరు ఓ లుక్కేయండి.
Bholaa Shankar : రెమ్యూనరేషన్ విషయం చిరంజీవి, నిర్మాత గొడవ నిజమేనా..? వైరల్ అవుతున్న వాట్సాప్ చాట్..
