Site icon 10TV Telugu

Kantara : ‘కాంతార’లో నటించిన మరో వ్యక్తి మృతి.. ఇప్పటికే నలుగురు.. అసలేం జరుగుతుంది..

One more Actor Passed away from Kantara Movie Unit

Kantara

Kantara : కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాంతార సినిమాతో 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే వరుస మరణాలు కాంతార యూనిట్ ని భయపెడుతున్నాయి.

ఇప్పటికే కాంతార ప్రీక్వెల్ సినిమాలో నటించిన ఇద్దరు యువకులు మేలో చనిపోయారు. ఆ తర్వాత జూన్ లో కాంతారలో నటించిన కళాభవన్ అనే నటుడు చనిపోయాడు. తాజాగా కాంతార లో నటించిన రంగస్థల నటుడు ప్రభాకర్ కళ్యాణి మరణించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్ ఆగస్టు 7 గురువారం నాడు మరణించారు.

Also See : Deepika Rangaraju : బ్రహ్మముడి ఫేమ్ దీపిక రంగరాజు.. వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఫొటోలు..

ప్రభాకర్ ఫ్యామిలీ చెప్పిన దాని ప్రకారం.. ఇటీవల ప్రభాకర్ ఇంట్లో జారి పడి చికిత్స తీసుకుంటున్నాడు. గురువారం నాడు కళ్ళు, చేతులు నొప్పిగా ఉన్నాయని చెప్పడంతో అతన్ని హాస్పిటల్ కి తరలించేలోపే మధ్యలో మరణించాడని తెలిపారు. ఈయనకు కాంతారలో ఒక వేషం ఇస్తానని చేపి చివర్లో వేషం మార్చారని, న్యాయవాది పాత్రని ఇచ్చారని ప్రభాకర్ నిరాశకు గురయినట్టు సన్నిహితులు తెలిపారు.

అయితే కాంతారకి చెందిన వాళ్ళు ఇలా వరుసగా మరణిస్తుండటం, కాంతార సెట్ లో అగ్ని ప్రమాదం జరగడం, కొంతమందికి కాంతార సెట్లో ప్రమాదాలు అవ్వడం.. ఇలాంటి ఘటనలు చూసి పలువురు ఏదో జరిగిందని, కొంతమంది అయితే దేవుడికి సంబంధించిన సినిమా ఏదో తప్పు చేసి ఉంటారని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మూవీ యూనిట్ కూడా ఈ వరుస ఘటనలతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. కాంతార మూవీ యూనిట్ లో అసలేం జరుగుతుంది అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంతార ప్రీక్వెల్ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

Also Read : Anandhi : ఆనంది హీరోయిన్ అయినపుడు స్కూల్ చదువుతుందట.. ఏ క్లాస్ తెలుసా? యాక్టింగ్ వద్దనుకుంది.. కానీ..

Exit mobile version