Orange Re Release : ఆరెంజ్ రీ రిలీజ్.. నేను విన్నాను, నేను ఉన్నాను అంటున్న నాగబాబు..
రామ్‌చరణ్ కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ 'ఆరెంజ్'. ఇక ఈ సినిమా విడుదలయ్యి నవంబర్ 26కి 12 ఏళ్ళు పూర్తీ అయ్యాయి. దీంతో ఈ సినిమాను రీ రిలీజ్ చేయమని అభిమానులు, నిర్మాత నాగబాబుని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. వీటికి స్పందిస్తూ నాగబాబు..
- gum 95921
- Published on- November 27, 2022 / 05:39 PM IST
Orange Re Release
Orange Re Release : రామ్‌చరణ్ కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘ఆరెంజ్’. ఫస్ట్ టైమ్ చరణ్ ఒక లవర్ బాయ్ క్యారెక్టర్ లో కనబడుతూ నటించిన ఈ సినిమా అప్పటిలో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మగధీర వంటి మాస్ యాక్షన్ సినిమా తరవాత ఈ సినిమా రావడంతో, అభిమానులు ఈ సినిమాను అంగీకరించలేకపోయారు.
Ram Charan : బుచ్చిబాబుకి చరణ్ ఓకే చెప్పాడా??
కానీ ఈ సినిమాలోని కథకు, పాటలకు, డైలాగ్స్ కు, రామ్ చరణ్ స్టైల్ కు.. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికి ఈ మూవీ సాంగ్స్ చాలా మంది ఫేవరెట్ ప్లేలిస్ట్ లో మోగుతూనే ఉంటాయి. ఇక ఈ సినిమా విడుదలయ్యి నవంబర్ 26కి 12 ఏళ్ళు పూర్తీ అయ్యాయి. దీంతో ఈ సినిమాను రీ రిలీజ్ చేయమని అభిమానులు, నిర్మాత నాగబాబుని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు.
వీటికి స్పందిస్తూ నాగబాబు.. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ఒక మిమ్ వీడియో ద్వారా బదులిచ్చాడు. “చాలా మంది హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిత్రం ఆరెంజ్. అభిమానుల డిమాండ్ మేరకు త్వరలోనే ఒక మంచి సందర్భం చూసుకొని ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తాను” అంటూ వెల్లడించాడు. ఇక ఈ వార్త తెలిసిన ఆరెంజ్ అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
