Ram Charan : బుచ్చిబాబుకి చరణ్ ఓకే చెప్పాడా??

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. శంకర్ తో చేస్తున్న సినిమా సగానికి పైగా అయిపోయింది. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా క్యాన్సిల్ అయ్యింది అని వినిపిస్తుంది. మరి నెక్ట్స్ సినిమా..........

Ram Charan : బుచ్చిబాబుకి చరణ్ ఓకే చెప్పాడా??

Ram Charan :  రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. శంకర్ తో చేస్తున్న సినిమా సగానికి పైగా అయిపోయింది. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా క్యాన్సిల్ అయ్యింది అని వినిపిస్తుంది. మరి నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తున్నాడో అంటూ చరణ్ గురించే కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఏ స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దింపుతాడో అని అందరూ వెయిట్ చేస్తున్న టైమ్ లో ఒకే ఒక్క సినిమా చేసిన అప్ కమింగ్ డైరెక్టర్ కి ఛాన్సిచ్చారు చరణ్.

రామ్ చరణ్ తన 16వ సినిమాకు సంబందించి క్లారిటీ వచ్చింది. నిజానికి జెర్సీ చేసిన గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్నట్టు లాస్ట్ ఇయరే అనౌన్స్ చేశారు చరణ్. అయితే అటు ఆచార్య ఫ్లాప్ తో పాటు గౌతమ్ కి హిందీ జెర్సీ ఫ్లాప్ అవ్వడంతో చరణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. గౌతమ్ తో రిస్క్ ఎందుకుని ఆ సినిమా క్యాన్సిల్ చేసుకున్నారు. మరి చరణ్ నెక్ట్స్ సినిమా ఎవరితో అన్న విషయంపై మాత్రం రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా చరణ్ కొత్త సినిమాపై క్లారటీ వచ్చింది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో తన నెక్ట్స్ సినిమా మొదలుపెట్టబోతున్నారు చరణ్ అని సమాచారం.

బుచ్చిబాబు చెప్పిన స్టోరీ చరణ్ కు నచ్చడంతో బుచ్చిబాబుతో సినిమా ఓకే చేసేశారు చరణ్. బుచ్చిబాబు-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఉంది అన్నారు కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలకి డేట్స్ ఇచ్చాడు. ఇప్పట్లో ఎన్టీఆర్ ఖాళీ అయ్యేలా లేడు. బుచ్చిబాబు ఉప్పెన వచ్చి రెండేళ్లు అయిపోతుంది. అప్పట్నుంచి ఖాళీగానే ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తే మరింత ఆలస్యం అవుతుంది అని వేరే కథలని, వేరే హీరోలకి వినిపిస్తున్నాడు.

KV Vijayendraprasad : నేను కథలు రాయను.. దొంగిలిస్తాను..

దీంతో రామ్ చరణ్ కి వినిపించిన కథ చరణ్ కి నచ్చడంతో బుచ్చిబాబుకి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే ఒక మెగా హీరోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు ఇప్పుడు మరో మెగా హీరోని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఎన్టీఆర్ నుంచి చరణ్ కి షిఫ్ట్ అయ్యాడు బుచ్చిబాబు. ఎలాగో మైత్రి మూవీ మేకర్స్ వద్ద బుచ్చిబాబు అడ్వాన్స్ తీసుకున్నాడు. చరణ్ కూడా మైత్రి మూవీ మేకర్స్ కి ఇంకో సినిమా చేయాలి. దీంతో వీరి కాంబినేషన్లోనే ఈ సినిమా ఉండొచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు.